ఐడియా

మధుమేహ రోగులకో తీయటి కబురు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. పండును చూసినా, పండు వెదజల్లే పరిమళం చేరినా ముక్కుపుటాలతో పాటుగా మనసు ఆహ్లాద పూరితం అవుతుంది. కాని షుగర్ వ్యాధి గ్రస్తులు మామిడి అంటే తమకు ఇష్టం మున్నా వాటిని తినడానికి సందేహిస్తుంటారు. ఒకవేళ ఈ పండును తింటే షుగర్ లెవల్ పెరిగిపోతుందేమోనన్న సందేహం వారిని వేధిస్తుంటుంది. ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ పంకజ్ అగర్వాల్ మామిడి పండును షుగర్ వ్యాధి గ్రస్తులు నిశ్చతంగా నిర్భయంగా తినచ్చు అని అంటున్నారు. కాకపోతే శ్రుతి మించకుండా ఎక్కువగా కాకుండా మామిడి పండ్లను తినొచ్చు. మామిడిపండ్లల్లో విటమిన్‌సి, ఎ, బి6, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ మొదలైనవి ఉంటాయి. ఒక మామిడి పండు ఒకటిన్నర రోటీతో సమానం. రోజుకు ఒక్క మామిడి పండు తిన్నంత మాత్రాన రక్తంలో గ్లూకోజ్ పెద్దగా పెరిగిపోదు. కాకపోతే అన్నం తిన్న వెంటనే లేదా అన్నంతో పాటుగా మామిడి పండును తినకూడదు. స్నాక్స్ టైమ్‌లో స్నాక్స్‌కు బదులుగా మామిడి పండును తీసుకోవచ్చు. దానివల్ల తగినంత శక్తి మాత్రమే లభిస్తుంది. నాలుగు గంటల విరామంలో రోజకు మూడు పర్యాయాలు మామిడి పండును ప్రతిసారి సగానికి మించికుండా తీసుకోవచ్చు. వేయించిన శనగలు, లేదా పెసరపప్పుతో పాటు మామిడి పండు ను తీసుకొన్నట్లయితే ప్రొటీన్స్, ఫైబర్ తగినంత లభించి రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోకుండా నియంత్రణలో ఉంటుంది.
*