ఐడియా

మేకప్ మెళకువలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖానికి మెరుగులు దిద్దుకుంటే సహజ అందం రెట్టింపు కావాలి.. చూసిన వారందరూ అలా చూస్తూనే ఉండిపోవాలి. అంతేకానీ మేకప్ వేసుకున్నట్లు అందరికీ తెలిసేట్లుగా, ఎబ్బెట్టుగా, అసహ్యంగా ఉండకూడదు. అందంగా మేకప్ కావాలంటే కొన్ని మెళకువలు తెలిసి ఉండాలి. అప్పుడే మీరు అందర్లో జాబిలిలా తళుకులీనుతారు.
* మేకప్‌లో ముఖ్యమైనది ఫౌండేషనే. ఇది ఎవరి చర్మతత్త్వాన్ని అనుసరించి అనుగుణమైన ఫౌండేషన్‌ను ఎంచుకోవాలి.
* బ్లష్ చేసుకోవాలనుకున్నప్పుడు అది చర్మరంగుకు మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. తెల్లగా ఉన్నవారు పీచ్, పేల్ పింక్, గులాబీ తరహా బ్లష్‌లను వాడవచ్చు. చామనఛాయగా ఉన్నవారు బెరీ, ప్లమ్‌లను ఎంచుకోవచ్చు.
* బ్లష్, లిప్‌స్టిక్‌లను ఎప్పుడూ మ్యాచింగ్‌గా తీసుకుంటే చాలా బాగుంటుంది.
* మామూలుగా అయితే ఐ లైనర్ నలుపురంగుది బాగుంటుంది. ఫ్యాషన్‌గా అయితే గ్రే, బ్రౌన్‌షేడ్‌వి వాడుకోవచ్చు.
* ఐ షాడోలను ఎవరికి నచ్చినట్లు వారు అంటే మరీ ముదురు రంగులు కాకుండా ఎంచుకుంటే బాగుంటుంది.
* కనుబొమ్మల్ని అతిగా తీర్చిదిద్దుకోకూడదు. ఎబ్బెట్టుగా కనిపించే ప్రమాదం ఉంది.
* కళ్ల అడుగు భాగాన తేమ లేకుండా చూసుకోవాలి. లేకపోతే కంటి కింద ముడుతలు కనిపించే ప్ర మాదం ఉంది. అందుకని రాతి పడుకోబోయే ముందు తప్పనిసరిగా మాయిశ్చరైజర్ పూసుకోవాలి.
* ప్రతిరోజూ భారీ మేకప్ వేసుకోకుండా.. సింపుల్‌గా ఫౌండేషన్, లిప్‌స్టిక్, బ్లష్, ఐబో షేపర్లు వాడితే చాలు. ఫంక్షన్లు ఉన్నప్పుడు మస్కారా, లైనర్, ఐషాడోలు వేసుకుంటే ప్రత్యేకంగా కనిపించవచ్చు.
* ముఖానికి వాడే ప్రతీదీ నాణ్యమైనదిగా ఉండాలి. అంటే నాణ్యమైనక్రీంలు, ఫౌండేషన్లు, మేకప్ బ్రష్‌లు, ఐ లైనఠ్లను ఎంచుకోవాలి. అప్పుడే ముఖానికి ఎటువంటి హానీ జరగకుండా ఉంటుంది.
*