ఐడియా

చుండ్రు సమస్య .. తప్పించికోండిలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్యకాలంలో కాలుష్యం బాగా పెరిగిపోయింది. కుటుంబంలోని ప్రతివారు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. దానితో రోడ్లపైన చిన్న పెద్ద వయస్సు తారతమ్యం లేకుండా వివిధ వాహనాల్లో ప్రయాణిస్తునే ఉన్నారు. మనదేశంలో ముఖ్యంగా వారంరోజుల్లో ఆరురోజులు పనిరోజులు అయినా ఏడవరోజు కూడా రోడ్లమీదకు వచ్చేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈ వాహనాలు, రోడ్ల మరమ్మత్తులు, ఫ్యాక్టరీలు, ఎండలు, వానలు ఇలా ఎనె్నన్నో కారణాల వల్ల ప్రతివారికీ జుట్టు సమస్యగా మారుతోంది. అమ్మాయి అనగానే బారెడు జడ అని గుర్తుకు వచ్చే రోజులు పోయాయి. అందరూ పోనీటైల్స్ వేసుకొన్నా ఆ కాస్తంత జుట్టుకూడా నిలువకుండా రాలిపోతోంది. ఏ పదిమంది స్ర్తిలను ప్రశ్నించినా జుట్టు ఊడిపోతుందనే చెబుతుంటారు. ఎందుకు ఇలా జుట్టు ఊడిపోతుంది అనే డాక్టర్లను అడిగితే వారు కాలుష్యం దెబ్బఅంటారు. ఈ కాలుష్యం వల్ల అప్పటిదాకా లేకపోయినా చాలామందికి చుండ్రు సమస్య వస్తోంది. పైగా తలంతా ఒకటే దురదగాను, దురదకు గీరుకుంటే గోళ్లల్లోకి చర్మం వచ్చేయడమో, రక్తం కారడమో జరుగుతోంది. ఇవి ఎందుకు కలుగుతున్నాయో అని డాక్టర్ల దగ్గరకు వెళ్లితే కాలుష్యం వల్ల ఇలాంటివి జరుగుతాయి అని చెప్తారు. చుండ్రు సమస్య వల్ల కూడా ఇట్లాంటి ఏర్పడవచ్చు. ఈ చుండ్రుసమస్యను, లేక జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవాలంటే * గసగసాలను మెత్తగా పేస్టుచేసుకుని తలకు పట్టించి గంట తర్వాత కడుక్కోవాలి.
* మందార పూలరసాన్ని తీసుకొని అంతే మోతాదులో నువ్వుల నూనెను కలుపుకుని స్టవ్‌పై వేడి చేసి బాగా మరిగిన తరువాత దించాలి. ఇలా కాగిన నూనెను సీసాలో భద్రపర్చుకుని తలకు రోజూ పెట్టుకుంటే చుండ్రు సమస్యనుంచి బయటపడవచ్చు. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
* వేప విత్తనాలను, కానుక విత్తనాలు సమపాళ్లల్లో తీసుకొని వాటిని మెత్తగా పేస్టు లాగా చేసుకొని దానికి కాస్త కర్పూరం కలిపి తలకు రాసుకొని ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే కూడా జుట్టు ఊడడం, జుట్టు చుండ్రు సమస్య తగ్గుతుంది.
* పారిజాత విత్తనాలను మెత్తగా పేస్టు చేసుకొని తలకు పట్టించాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు సమస్యలనుంచి తప్పించుకోవచ్చు.

- శ్రీలత