క్రీడాభూమి

ఇదెక్కడి పద్ధతి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాక్టీస్‌కు అనుమతించలేదంటూ కోల్‌కతాపై జికో ఆగ్రహం
కోల్‌కతా, నవంబర్ 21: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం కీలక మ్యాచ్‌కి సిద్ధమయ్యేందుకు వీలుగా ప్రాక్టీస్ చేసుకునే అవకాశం తమకు దక్కలేదని గోవా ఫుట్‌బాల్ క్లబ్ కోచ్ జికో వాపోయాడు. డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతాతో గోవా మ్యాచ్‌ని ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం ప్రాక్టీస్‌కు వివేకానంద యువ భారతి క్రీడాంగణ్‌లో ఇరు జట్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉండింది. అయితే, ఇటీవలే అందులో వేసిన ఆస్ట్రోటర్ఫ్ కొన్ని చోట్ల దెబ్బతినడంతో ప్రాక్టీస్‌కు అధికారులు అనుమతించలేదు. శనివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో జట్టు జెర్సీని ఆవిష్కరించిన జికో మాట్లాడుతూ పక్కనే ఉన్న బిధాన్‌నగర్ మున్సిపల్ కార్పోరేషన్ (బిఎంసి) మైదానంలో ప్రాక్టీస్‌కు అనుమతించాలని కోరినట్టు చెప్పాడు. కానీ, అక్కడ ప్రాక్టీస్‌కు అధికారులు తిరస్కరించారని అన్నాడు. నిబంధనల ప్రకారం అన్ని సదుపాయాలను కల్పించే బాధ్యత ఆతిథ్య నగరంపై ఉంటుందన్నాడు. కానీ, కోల్‌కతా యాజమాన్యం ఈ విషయాన్ని విస్మరించడం దురదృష్టకరమని విమర్శించాడు. ఒకవేళ ఇలాంటి పరిస్థితే గోవాలో ఎదురైతే, తాము ప్రాక్టీస్‌ను మార్చుకొని ఆ అవకాశాన్ని అతిథి జట్టుకు ఇచ్చి ఉండేవాళ్లమని పేర్కొన్నాడు. కానీ, ఇక్కడ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందన్నాడు. (చిత్రం) గోవా ఫుట్‌బాల్ క్లబ్ కోచ్ జికో