ఐడియా

లావొక్కింతయురాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీర్ణశక్తిని పెంచే పానీయాలుఊబకాయానికి చెక్
నాజూకుగా మారేందుకు అవకాశం

ఉరుకుల పరుగులతో సాగేలా ఆధునిక మానవుని జీవనశైలే నేడు మారిపోయింది. దీం తో ఆహార నియమాలు పాటించే సమయం లేదు. ఊబకాయం మనిషి ఉసురుతీస్తోంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నా లావైపోతున్నామని బాధపడేవారి సంఖ్య రోజురోజుకు అధికమవుతుంది. రెండేళ్ల నుంచి అవే ఆహారపు అలవాట్లు పాటిస్తున్నా బరువు పెరుగుతూనే ఉన్నారు. జీర్ణశక్తిలో ఏర్పడే లోపాలను సరిదిద్దుకోలేక సగటు మానవుడు నానాప్రయాసపడుతున్నాడు. జీర్ణశక్తికి దోహదం చేసే ఈ పానియాల ను రోజూ తీసుకుంటే మంచిదని నిపుణు లు సూచిస్తున్నారు. మార్కెట్లో దొరికే సులువుగా దొరికే వీటితో చిటికెలో ఈ పానియాలను తయారుచేసుకోవచ్చు.
ఉసిర, కలబంద, వీట్‌గ్రాస్ జ్యూస్
ఉసిరి, కలబంద, వీట్‌గ్రాస్ పొడిని కలుపుకు ని జ్యూస్ గా తాగితే జీర్ణశక్తి అమోఘంగా పనిచేస్తుంది. రోజూ ఓ ఉసిరికాయ రసం, ఓ టీ స్పూన్ కలబంద గుజ్జును, ఓ టీ స్పూన్ వీట్‌గ్రాస్ పొడిని కలిపి జ్యూస్‌గా తయారుచేసుకోవాలి. పరగడుపున ఈ మిశ్రమాన్ని నీటిలో కలుపుకుని గ్లాస్ జ్యూస్ తాగాలి. కనీసం ముప్పయి నిమిషాలు పాటు ఆహారాన్ని తీసుకోకూడదు.
నీరు, ఆపిల్ పళ్ల రసం, వెనిగర్
ఈ మూడింటి మిశ్రమాన్ని కూడా రోజుకు ఓ గ్లాస్ పరగడపున తీసుకుంటే ఎంతో మంచిది. ఇలా ప్రతిరోజూ తీసుకోవటం వల్ల శరీరంలో ఉండే విష పదార్థాలు బయటకు పోతాయి.
బ్లాక్ కాఫీ భేష్
ఉదయం పొట కాఫీ తీసుకున్న ఫరవాలేదు అని అంటున్నారు. 50 మిల్లీలీటర్ల కెఫెన్ తీసుకుంటే జీర్ణశక్తికి దోహదం చేస్తుందని క్లినికల్ న్యూట్రిషన్ జర్నల్‌లో ఒ అధ్యయన రిపోర్టులో వెల్లడైంది. చెక్కర లేకుండా బ్లాక్ కాఫీని తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఉబకాయంతో బాధపడేవారు బ్లాక్ కాఫీ తీసుకుంటే మంచిదని పేర్కొంటున్నారు.
కొబ్బరి నీరు
జీర్ణశక్తి పెంచటానికి అత్యంత దోహదం చేసేది ప్రకృతి సిద్ధమైన కొబ్బరి నీరు ఎంతో శ్రేష్టం. ఎలెక్ట్రోలైట్స్, ఖనిజాల సమాహారమైన కొబ్బరినీరు ప్రతిరోజూ తాగితే జీవనశైలిలో ఎలాంటి మార్పులు సంభవించిన వాటి వల్ల ఒనగూడే అనారోగ్యాలను నివారించుకోవచ్చు.
బెర్రీ రసం
బ్లూబెర్రీ, చెర్రీ, బ్లాక్‌బెర్రీ వంటి పండ్లుతో తయారుచేసిన జ్యూస్ తాగమని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. వీటిల్లో ఆమ్లాలు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రోజు ఈ పళ్లతో చేసిన జ్యూస్‌ను తాగితే చురుకుగా పనిచేస్తారు.