ఐడియా

సమర్థతకు దక్కిన గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ముదితలు నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పింపగన్’ అన్నాడు ఒక మహాకవి. అందుకు ప్రత్యక్ష నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. వారిలో ఒకరు క్రెస్సిడా డిక్. ప్రపంచంలో అత్యంత సమర్థవంతులైన పోలీసులు ఎవరూ అంటే, తడుముకోకుండా చెప్పే సమాధానం స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసు అని. మన దేశానికి చెందిన పోలీసు అధికారులు స్కాట్‌లాండ్ యార్డ్‌లో శిక్షణకు ఎంపికవ్వడం అంటే, అది అరుదైన గౌరవంగా భావిస్తారు. సాలీనా, ప్రపంచంలోని వివిధ దేశాలనుంచి వేలాది మంది పోలీ సు అధికారులు స్కాట్‌లాండ్ యార్డ్‌లో శిక్షణ పొందడానికి వస్తుంటారు. 188 సంవత్సరాల ఘనచరిత్ర కలిగిన స్కాట్‌లాండ్ యార్డ్‌కు తొలిసారిగా ఒక మహిళ నేతృత్వం వహిస్తున్నారు. ఆమె క్రెస్సిడా డిక్. లండన్ మెట్రోపాలిటన్ పోలీస్‌నే స్కాట్‌లాండ్ యార్డ్ అని పిలుస్తారు. ప్రస్తుతం స్కాట్‌లాండ్ యార్డ్ కమిషనర్‌గా వున్న బెర్నార్డ్‌హో గన్‌హావే పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో ప్రస్తుతం అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్న క్రెస్సిడా డిక్ ఎంపికయ్యారు. 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా, ప్రశాంతంగా నిర్వహించడంలో ఆమె సఫలీకృతులయ్యారు. దీంతో ఆమె స్కాట్‌లాండ్ యార్డ్ చీఫ్‌గా ఎంపికయ్యారు.
అన్నింటిలో ఇంగ్లాండ్‌ను ఆదర్శంగా తీసుకొనే మన దేశం, కీలక పదవులను మహిళలకు అప్పగించడంలో మాత్రం వెనుకంజ వేస్తున్నది. మన దేశంలో మొద టి ఐపిఎస్ అధికారిణి కిరణ్‌బేడి. ఆమెను ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా నియమించడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. చివరి నిమిషంలో ఆమెను కాదని వై.ఎస్. దడ్వాల్‌ను నియమించారు. అప్పటినుంచి మహిళలెవ్వరినీ ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా నియమించకపోవడం గమనార్హం. ఇకనైనా మన పాలకులు కళ్లుతెరచి, మహిళలకు కూడా ఉన్నత బాధ్యతలు అప్పగిస్తారని ఆశిద్దాం.

- పి.హైమావతి