ఐడియా

పేదోడి ప్రతిభకు పేదరికం ఓడింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెన్నుకూడా కొనలేని స్థితిలో ఓ విద్యార్థి
చదువులో రాణింపు.. నేషనల్ లా స్కూల్లో చేరికకు చాన్స్

అది మణిపూర్‌లో మూలకు విసిరేసినట్లు ఉండే గుమ్నామ్ అనే కుగ్రామం. అక్కడ పట్టుమని పది గుడిసెలు కూడా ఉండవు. కుకి జాతికి చెందిన గిరిజనులు ఆ గుడిసెల్లో ఉంటారు. అందులో ఓ గుడిసెలో ఐదుగురు తోడబుట్టిన వాళ్ల మధ్య ఓ ఏడేళ్ల పిల్లాడి కళ్లల్లో చిరు ఆశ. ఏదైనా సాధించాలనే పట్టుదల ఆ చిన్నారి కళ్లల్లో తొణకిసలాడేది. ఏనాటికైనా తమ దుస్థితి మారుతుందా? అనే ఆలోచన వెన్నాడుతుండేది. అక్షరం ముక్కరాని ఆ పదిళ్లల్లో నిత్యం ఏవో గొడవలు. ఓ రోజు ఈ గలాటాను చూసి భయంతో ఆ గ్రామం నుంచి పారిపోయాడు. అలా బెంగళూరు చేరి పాస్టర్‌గా పనిచేస్తున్న మేనమామ పంచన చేరాడు. కుగ్రామంలో మాట్లాడే భాష, వేషమే తన ప్రపంచమని బతికిన ఆ పిల్లాడికి ఒక్కసారిగా ఆ మహానగరంలో భాష, వేషం తికమక పెట్టాయి. అయినా నిబ్బరాన్ని కోల్పోకుండా వేలుపట్టి నడిపించిన మేనమామతో కలిసి పరిక్రమ హ్యుమానిటీ ఫౌండేషన్‌లో అడుగులు వేశాడు. అక్కడే తన భావి జీవితానికి పునాదులు వేసుకున్నాడు. అతడే లాల్చా. మణిపూర్‌కు చెందిన ఈ మట్టిలో మాణిక్యం ప్రతిష్టాత్మక నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటిలో సీటు సంపాదించాడు.
కష్టాలు కలకాలం ఉండవు..
కష్టాలు కలకాలం ఉండవు. వంతెన కింద నీటి వలే అవి వస్తుంటాయి. పోతుంటాయి. వాటిని తట్టుకుని నిలబడి తన గురించి తాను తెలుసుకున్నవాడే విజేతగా నిలుస్తాడు. లాల్చా కూడా ఇదే నమ్మాడు. అంతర్గతంగా ఎప్పటికైనా మార్పు వస్తుందని నమ్మాడు. ఆ నమ్మకంతోనే పరిక్రమ హ్యుమనిటీ ఫౌండేషన్ నిర్వహించే చారిటీ స్కూల్లో చేరాడు. వారి సాయంతోనే కాలేజీ చదువు పూర్తిచేశాడు.
లా టెస్ట్‌లో టాప్ ర్యాంక్
మామయ్య సలహాతో కామన్ లా టెస్ట్ రాశాడు. 50 వేలమంది హాజరైన ఈ పరీక్షలో లాల్చా టాప్ ర్యాంక్ సాధించాడు. సీటు వచ్చింది. ఫీజు చెల్లించలేని పేదరికం. మళ్లీ పరిక్రమ స్కూల్ వాళ్లను కలిశాడు. తన దుస్థితిని వివరించాడు. వారి సలహాతో ఐడీఐఏ అనే సంస్థను కలిశాడు. ఈ సంస్థను స్ధాపించింది కూడా నేషనల్ లా స్కూల్‌లో గ్రాడ్యుయేట్ చదువుకున్న షమ్నద్ బషీర్ అనే పూర్వ విద్యార్థి. ఐడీఐఏ సంస్థ లాల్చా చదువు బాధ్యతను తలకెత్తుకుంది.
ఒక్క రూపాయి ఖర్చుపెట్టకుండా..
పెన్ను కూడా కొనుక్కోలేని కటిక పేదరికాన్ని అనుభవించే లాల్చా తనకెదురైన పరిస్థితులకు బెంబేలుపడి తలవంచినట్లయితే ఈనాడు ఇలాంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్శిటీలో సీటు సంపాదించేవాడు కాదు. జీవితంలో ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయకుండా సేవా సంస్థల సహకారంతో న్యాయదేవత ముందు సగర్వంగా తలెత్తుకునే స్థాయికి వచ్చాడు. నా జీవితంలో నేను కోరుకున్న మార్పునే నా కమ్యూనిటీలో మార్పు తీసుకురావటానికి పాటుపడతానని ఆ న్యాయదేవత ముందు ప్రతిన బూనాడు.

జీవితంలో ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయకుండా సేవా సంస్థల సహకారంతో న్యాయదేవత ముందు
సగర్వంగా తలెత్తుకునే స్థాయికి వచ్చాడు.