ఐడియా

వడదెబ్బ నుంచి రక్షణ ఇలా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తీవ్రమైన ఎండలో తిరిగినపుడు ఎండ తీవ్రతవలన శరీర ఉష్ణోగ్రత కూడా 105.1 డిగ్రీల ఫారన్‌హీట్ పెరిగి మెదడుమీద ప్రభావం చూపి వేడిని అదుపు చేయలేకపోవడం, చెమట ద్వారా నీరు, లవణాలు (సోడియం క్లోరైడ్) కోల్పోవడం శరీరాన్ని చల్లబరచి సహజ ఉష్ణోగ్రతకి తీసుకోలేకపోవడంవలన చివరికి స్పృహ కోల్పోవడం లేదా మరణించడం జరుగుతుంది. ఈ రకమైన పరిస్థితినే వడదెబ్బ లేక ఎండదెబ్బ (హీట్ స్ట్రోక్ లేదా సన్‌స్ట్రోక్) అని అంటారు. ఇది ప్రాణాంతకం.
ప్రాథమిక చికిత్స
వడదెబ్బకు గురైన వ్యక్తిని ముందుగా చల్లని నీడ ప్రదేశంలో చేర్చి పడుకోబెట్టి బట్టలను పూర్తిగా వదులు చేసి, వీలైతే ఫ్యాన్, ఎయిర్‌కూలర్ వేయాలి. గాలి బాగా తగిలేటట్లు చూడాలి. విసనకర్రతో విసరాలి. వడదెబ్బకుగురైన వ్యక్తి దగ్గర ఎక్కువమంది గుమికూడకూడదు. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి అనగా 98.6 డిగ్రీల ఫారిన్‌హీట్ వచ్చేవరకు ఐస్‌నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరాన్ని తుడుస్తుండాలి. ఐస్ నీటిలో ముంచిన కాటన్ దుప్పటితో శరీరంపై చుట్టాలి. రోగి స్పృహలో ఉంటే తాగగలిగితే రక్షిత నీటిలో సరిపడినంత ఉప్పు పంచదార కలిపి వడదెబ్బకు గురైన వ్యక్తికి తాగించాలి. లేదా పలుచని మజ్జిగలో నిమ్మరసం కొద్దిగా ఉప్పు కలిపి తాగించాలి. గ్లూకోజ్ ద్రావణం తాగించవచ్చు. ఇంకా అందుబాటులో ఉంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన ‘ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్’ (ఒఆర్‌ఎస్, ప్రాణరక్షణ పానీయము) ద్రావణాన్ని తాగించాలి. కొబ్బరినీరు, లెమన్, ఆరంజ్, యాపిల్, దానిమ్మ మొదలగునవి రెడీమేడ్ డ్రింకులు లభ్యమవుతున్నాయి. వడదెబ్బ తగిలిన రోగికి సేవలు చేసినప్పటికీ రోగిలో ఎలాంటి మార్పు లేకపోతే సమయం వృధా చేయకుండా 108కి ఫోన్ చేసి సాధ్యమైనంత త్వరగా సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి మెరుగైన చికిత్స అందించాలి.
ముందు జాగ్రత్తలు- ఆహార నియమాలు
ముఖ్యంగా తీవ్రమైన ఎండలో తిరుగరాదు. తప్పనిసరి పరిస్థితులలో ప్రయాణాలు చేసేవారు, బయటకు వెళ్ళవలసి వచ్చినపుడు తలపై రుమాలు, చుట్టూ అంచున్న టోపీ పెట్టుకోవడం, గొడుగు వేసుకోవడం, చలువ కళ్ళద్దాలు పెట్టుకోవడం, తెలుపు రంగుగల పలుచటి కాటన్ వస్త్రాలను ధరించడం, శరీరంలో చెమట రూపంలో నీరు పోతుంది గనుక డీహైడ్రేషన్ రాకుండా పోయిన నీటిని తిరిగి భర్తీచేయడానికి రక్షిత నీటిని ఎక్కువగా తాగాలి. వాతావరణ పరిస్థితులను బట్టి మనిషికి నీరు తీసుకోవలసిన అవసరాలు మారుతుంటాయి. కాబట్టి వేసవిలో నీరు మరింత ఎక్కువగా తాగాలి.
దాహం వేసినా వేయకపోయినా రోజుకి కనీసం 15 గ్లాసుల నీరు తాగాలి. (వాటర్ ఫర్ లైఫ్) వీటితోపాటు పలుచని గంజి, మజ్జగలో తగినంత ఉప్పు, నిమ్మరసం కలిపి తాగడం, కొత్తకుండలో నీరు తాగడం, కొబ్బరినీరు, బార్లీ, ఐస్ లేని తాజా చెరుకు రసం, క్యారెట్ జ్యూస్, తాజా పండ్ల రసాలు తాగాలి. నీరు అధికంగా వుండే పుచ్చకాయ కర్బూజ, దోసకాలు తినాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన వౌఖిక జల వియోజన ఒఆర్‌ఎస్, రెడీమేడ్ ఒఆర్‌ఎస్ తాగాలి. ఏదిఏమైనా వేసవిలో ఎక్కువ ద్రవ పదార్థాలు తాగాలి. మాంసాహారం తగ్గించి, తాజా కూరగాయలను వండుకుని తినడం, ఆహారం తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలి. వ్యక్తిగత శారీరక పరిశుభ్రత తప్పక పాటించాలి. రెండు పూటలా స్నానం చేయాలి.
వేసవి కాలంలో తినకూడని, తాగకూడని పదార్థాలు
చల్లని శీతల పానీయాలు తాగకూడదు. ఐస్‌క్రీంలు తినకూడదు. ఐసు వాడకూడదు. గుట్కాలు, మత్తుపానీయాలు, మద్యం సేవించకూడదు (మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం కూడా) పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. కలుషితమైన నీరు తాగకూడదు. కలుషితమైన ఆహారం తినకూడదు. వేపుడు కూరలు, మసాలాలు తగ్గించాలి. తీపిపదార్థాలు, స్వీట్లు ఎక్కువ తీసుకోకూడదు. రోడ్లమీద పక్కన అమ్మే చల్లని రంగు పానీయాలు (షర్బత్) తాగకూడదు.