ఐడియా

పెదాల రంగు మారాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదాలు సహజ సిద్ధంగా ఎర్రగా మెరుస్తూ తాజాగా కనిపించేందుకు మహిళలు చేయని ప్రయోగం అంటు ఉండదు. లిప్‌స్టిక్ వేయటం వల్ల పెదాలు ఇనె్ఫక్షన్లకు గురవుతుంటాయి. పెదాలు తడిగా ఉండాలంటే ఈ క్రింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
గులాబీ రేకులను పాలలో నానబెట్టి పేస్ట్‌వలే మెత్తగా చేసుకుని పెదాలకు రాసుకుంటే మృదువుగా ఉంటాయి.
దానిమ్మ గింజలను మిక్సీలో మెత్తగా పట్టించి ఈ పొడిని మీగడలో కలుపుకుని రాసుకుంటే నల్లబడిన పెదాల రంగు మారుతుంది.
ఆలీవ్ ఆయిల్ లో తేనె, పంచదార కలపండి. పెదాలు శుభ్రంగా కడుక్కున్న తరువాత ఈ మిశ్రమంతో రుద్ది చూడండి. మంచి రంగు కనిపిస్తుంది.
రోజూ బ్రష్ చేసిన తరువాత, అదే బ్రష్‌పై ఒక టీస్పూను పంచదార ఆలీవ్ ఆయిల్, కొబ్బరి నూనె వేసి పెదాలపై ముప్పయి సెకన్ల పాటు రుద్దండి. రోజూ ఇలా చేస్తుంటే పెదాలకు లిప్‌స్టిక్ వేయాల్సిన అవసరం ఉండదు. * ప్రతిరోజూ క్రమతప్పకుండా తాజా పండ్లూ, కూరగాయలూ తింటే మంచిది.
బీట్‌రూట్‌ను మెత్తని మిశ్రమంలా చేసి పెదాలకు రాసుకుని అరగంట తరువాత కడిగేసుకోండి. పెదాలు సహజ ఎరుపుదనంతో మెరుస్తాయి.
ఒక స్పూన్ వెన్నకు పసుపు కలిపి మిశ్రమాన్ని తయారుచేసుకోండి. ఈ మిశ్రమాన్ని రాత్రిపూట అరగంట సేపు అప్లయ్ చేయండి. పొద్దుటే కడిగేయండి. ఇలా తరచూ చేయటం వల్ల మంచి ఫలితం కనిపిస్తోంది.
బాదం నూనె, కొబ్బరి నూనె సమపాళ్లలో తీసుకుని రాస్తే పెదాలు నునుపుగా, తేమగా ఉంటాయి.
పాల మీగడతో రాత్రిపూట పెదాలను బాగా రుద్ది ఉంచేయండి. పొద్దుటే కడిగితే పెదాలు తేమగా ఉంటాయి.