ఐడియా

పేద తల్లికి ప్రేమకానుక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయం అందించనున్న గ్రాసియా రైనా ఫౌండేషన్
ప్రముఖ క్రికెటర్ సురేష్‌రైనా భార్య ప్రియాంక పెద్దమనసు

బిడ్డకు జన్మనివ్వటం తల్లికి మరో పునర్జన్మ వంటిదని అంటారు. కాని పిల్లలు పుట్టిన తరువాతే అమ్మకు అసలైన కష్టాలు ఆరంభమవుతాయి. ఆర్థికంగా ఉన్నతస్థితిలో ఉన్న తల్లులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాని రెక్కాడితే డొక్కాడని నిరుపేద తల్లు లే పిల్లల్ని ఆరోగ్యంగా పెంచలేక సతమతమవుతుంటా రు. బాలింతగా ఉన్నపుడు తల్లి మంచి ఆహారం తీసుకుంటేనే బిడ్డకు కడుపునిండా పా లు ఇవ్వగలదు. కాని నిరుపేద తల్లులు కూలీ పనులకు వెళుతూ పౌష్టికాహారం తీసుకోలేరు. అంతేకాదు బిడ్డకు జన్మనిచ్చిన తరువాత తల్లుల్లో శారీరకంగా, మానసికంగా అనేక మార్పులు సంభవిస్తాయి. విపరీతమైన ఒత్తిడికి గురవుతుంటారు. ముఖ్యంగా చిరు ఉద్యోగాలు చేసే ఉద్యోగినులు కష్టాలు అన్నీఇన్నీ కావు. అయినప్పటికీ ఇలాంటి తల్లులు తమ స్వేదా న్ని శక్తిగా మార్చి బిడ్డలను తీర్చిదిద్దుతారు. ఇలాంటి సమయంలో తల్లి మానసికంగా, శారీరకంగా పడే బాధ వర్ణనాతీతం. తన బాధను పంటి బిగువున భరిస్తుంది. ఇలాంటి వారి కోసం ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా భార్య ప్రియాంక ‘‘గ్రాసియా రైనా ఫౌండేషన్’’ను ఏర్పాటుచేశారు. శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతిన్న తల్లుల కోసం ఈ ఫౌండేషన్ తన సేవలను అందిస్తోంది. తమ ముద్దుల బిడ్డ గ్రాసియా పేరు మీద ఏర్పాటు చేసిన ఈ ఫౌండేషన్ అమ్మలైన ఉద్యోగినులు, ఆమె పిల్లలకు ఏదైనా సాయం కావల్సివస్తే అందిస్తుందని సురేష్‌రైనా దంపతులు వెల్లడించారు. నేడు నెలకొన్న సామాజిక, ఆర్ఢిక జీవన పరిస్థితుల వల్ల చాలామంది తల్లులు పిల్లలు పుట్టిన తరువాతే మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఫలితంగా అనేక రకాల వ్యాధులబారిన పడుతున్నారు. ఈ వ్యాధులను తేలిగ్గానే నయం చేసుకోవచ్చు. కాని వాటికి సంబంధించిన కనీస పరిజ్ఞానం ఆధునిక తల్లుల్లో లోపిస్తుంది. ఇటువంటివారు ఎలాంటి సాయం కావాలన్నా వారికి కావల్సిన మానిసిక విజ్ఞానం, చైతన్యం, ఆర్థిక స్వాతం త్య్రం కల్పించి వారిని సాధికారిత దిశగా అడుగులు వేసేలా ఈ ఫౌండేషన్ కృషిచేస్తుంది.
తల్లిపడే బాధ తెలుసు
‘ఓ బిడ్డకు తల్లయిన తనకు తల్లులు పడే బాధలు, కష్టాలు ఏమిటో తెలుసు. ఆర్థికంగా స్థిరపడితేనే ఏ మహిళైనా సాధికారిత దిశగా పయనించగలదు. అందుకే ఇలాంటి తల్లులు తమ జీవనోపాధి కోసం మంచి ఆరోగ్యకర వాతావరణంలో తగు నిర్ణయాలు తీసుకుని బిడ్డలను తీర్చిదిద్దుకునేలా వారికి సహకరించాలని భావిస్తున్నాను’ అని అంటున్నారు ప్రియాంక.
పేద తల్లుల కోసమే..
పిల్లల పెంపకంలో పేద తల్లులకు తలెత్తే ప్రాధమిక ఇబ్బందులను గుర్తించి అటువంటివారి కోసం ఎలాంటి సాయం కావాలో తెలుసుకుని ఈ ఫౌండేషన్ అందిస్తుంది. పిల్లలకు, తల్లులకు ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తుంది. అలా గే వారి జీవనోపాధి కోసం అవకాశాలను కల్పిస్తుంది. గర్భిణీలు తమ గురించి, తమ పిల్లల కోసం తగు సమయంలో మంచి నిర్ణయాలు తీసుకునేలా కౌన్సిలింగ్ ఇస్తుంది. నిరుపేద తల్లుల సామర్థ్యాన్ని మెరుగుపర్చటం, శక్తివంతులను చేయటంతో పాటు వారి అవసరాలను కనిపెట్టి అందిస్తుంది. పిల్లల పెంపకంలో పేద తల్లులకు ఎలాంటి ఇబ్బందులెదురైనా వారు వచ్చి సాయం అడిగితే ఈ ఫౌండేషన్ అందిస్తుంది. పేద తల్లులకు సేవలందించేందుకు ఈ ఫౌండేషన్ అవసరమైతే ప్రభుత్వ అధికారులు, ఎన్జీఓ సంస్థల సహకారం సైతం తీసుకుని పేద పిల్లలు, తల్లు లు మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగేలా ఈ ఫౌండేషన్ కృషి చేస్తుంది.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదా ఈ కింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03