ఐడియా

అధిగమిద్దాం విటమిన్ల లోపాన్ని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునుపు హాయిగా బోలెడంత నెయ్యి వేసుకుని ముద్దపప్పు, సున్నిండలు తినేవాళ్ళు. ఆవకాయ, గోంగూర లాగించేవాళ్ళు. అలాగే అరటి, జామ, బొప్పాయి పళ్ళు పేదవాడికి సైతం దొరికేవి. పచ్చిదుంపలు, కాయలు, చీప్ అంటూ చీపుగా భావించకుండా ఓపిగ్గా వలిచి వండిపెట్టే ములగ, తోటకూర, మెంతి లాంటి ఆకుకూరలు తిని, పొద్దున్న సాయంత్రం వీధి వాకిలి చిమ్మే సమయంలో పడే ఎండతో డి విటమిన్ రావడమే కాక జిమ్ములు, యోగాలతో పనిలేకుండా వ్యాయామం అయ్యి విటమిన్లు వంటబట్టేవి. తిన్న పదార్థాల్లో కొవ్వు కరిగి స్లిమ్ముగానూ బాడీ వుండేది.
- బట్టలు వాషింగ్ మెషిన్ ఉతికినా ఆరవేయడం, మడతపెట్టడం కూడా పనిమనిషితో చేయించకుండా మీరే చేసేస్తే చేతులకు మంచిది. అన్నింటికి మిక్సీ మీదే ఆధారపడకుండా చిన్న మీడియం సైజు రోలు తెచ్చుకుంటే మిక్సీకి అందని తక్కువ మోతాదున్నవి దంచుకోవటం, రోటి పచ్చళ్ళు కచ్చాపచ్చాగా చేసుకుంటే కొంచెం సరదా, అదే అమ్మ చేతి పాత రుచి సొంతమవుతుంది. చేతులు భుజాలు గట్టిపడతాయి.
- టీవీ చూస్తూనో ఫోన్ మాట్లాడుతూనో ఊరికే ఉండకుండా ఏదో ఒక ఆకుకూర వలుచుకోవటం పనిగా పెట్టుకోండి. విసుగనిపించదు. ఎండిపోయిన కొత్తిమీర కరివేపాకులను పుదీనా పడవేయకుండా పొడి చేసుకుంటే గ్రీన్ చట్నీలో వాడుకోవచ్చు. అదేవిధంగా బీరకాయ పొట్టు, నిమ్మ తొక్కల్లాంటివి కడిగి శుభ్రంగా ఎండబెట్టి పొడి చేసుకుంటే కూరల్లో అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు.
- వంట చేస్తున్నపుడు బెల్లం, ఖర్జూరం లేదా నట్స్ అవైలబుల్‌గా పెట్టుకుని ఏది తినాలనిపిస్తే అది నోట్లో వేసుకుని తింటూ నిలబడి వండే సమయంలో కాళ్ళు ఒకటి తరువాత ఒకటి జాగింగ్ చేస్తున్నట్లు ఉన్నచోటే చేస్తుంటే నడుము, తొడల్లో ఎక్సెస్ కొవ్వు పేరుకోదు. దోస, చపాతీలు నాన్‌స్టిక్‌లో కాకుండా ఐరన్ తవాల్లో చేసుకుంటే క్యాన్సర్లురావు సరికదా ఐరన్ లోపం రాదు.
- గంటకోసారి గ్లాసుడు నీళ్ళు త్రాగటం మరవకుండా వీలైతే మధ్యలో ఒకసారి నిమ్మరసమో, పల్చటి మజ్జిగో ఏదైనా జ్యూసో తీసుకోగలిగితే కావాల్సినంత సి విటమిన్ లభిస్తుంది.
- సాయంత్రం శ్రమనుకోకుండా చాటింగ్ కాసేపు ఆపేసి రిలాక్స్‌డ్‌గా పూజ గదిలోకెళ్లి పూలు, పళ్లు ఉన్నా, లేకపోతే కనీసం కుందిలో దీపం వెలిగించి అగరొత్తులు ధూపం సమర్పించి కళ్ళు మూసుకుని పది నిమిషాలు కూర్చుని వస్తే సపరేటుగా ధ్యానం అవసరం లేదు. దీపం అగరొత్తులు కర్పూర పరిమళాలే అరోమా ధెరపిలాగా పనిచేసి మనసుకు ఆహ్లాదాన్నిచ్చి టెన్షన్స్, డిప్రెషన్స్ నుంచి దూరం చేస్తాయి.

-డేగల అనితాసూరి