ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేదవాడికి కూడా అందుబాటులో వుండే ఆరోగ్య ప్రదాయిని అరటిపండు. ఇందులోని మినరల్స్, విటమిన్లు, పిండి పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించటలోనూ, శరీరం బరువును అదుపులో ఉంచటంలోను, రక్తంలో కొవ్వును తగ్గించటంలోనూ దోహదపడతాయి. మార్కెట్‌లో చౌకగా లభిస్తున్నాయని, పేరంటాల్లో, వివాహాల్లో ఉచితంగా లభిస్తున్నాయని అరటిపండ్లను చులకనగా చూడకూడదు. దక్షిణ భారతీయుల వంటకాలలో అరటి వంటకాలది విడదీయలేని భాగంగా చెప్పవచ్చు. అరటికాయలతో చిప్స్, వడలు, సమోసాలు, కట్‌లెట్‌లు చేసుకుని నిల్వ వుంచుకుని మరీ తింటుంటారు. చపాతీలలోకి ఇగురు కూరగాను, గుజ్జు కూరగాను కూడా చేసుకోవచ్చు. అరటిని శెనగపిండిలో ముంచి వేయించిన అరటి బజ్జీల రుచి గురించి చెప్పనలవి కాదు. అరటికాయలో సహజ సిద్ధమైన చక్కెరలు, సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌లు సమాన స్థాయిలలో ఉండటం విశేషం. పీచు కూడా తగినంత ఉండడంతో తిన్నవెంటనే తేలికగా జీర్ణమై తక్షణ శక్తిని ఇస్తుంది. ఇందులోని పొటాషియం వల్ల రక్తపోటు తగ్గుతుంది. శరీరంలో నిల్వ వున్న కొవ్వును సరిచేసి దానిని శరీరానికి అవసరం అయ్యే శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది. అరటిపండులోని విటమిన్ ఇ, బి6 వంటివి హిమోగ్లోబిన్ తయారవ్వటంలోను, చక్కెర నిల్వలను నియంత్రించటంలోను ఉపయోగపడతాయి.

-హిమజారమణ