ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీట్‌రూట్‌ను వంటల కోసమే కాదు, శారీరక సౌందర్యాన్ని పెంచుకునేందుకు కూడా వాడొచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బీట్‌రూట్ రసంలో కాస్త బాదం నూనె, పెరుగు, బాగా ఎండబెట్టిన ఉసిరి పొడి కలిపి ముద్దలా చేసుకుని తరచూ తలకు రాసుకుంటే శిరోజాలు దృఢంగా, వొత్తుగా పెరుగుతాయి. ఈ మిశ్రమం జుట్టుకు మంచి కండిషనర్‌గా కూడా పనిచేస్తుంది. ఖరీదైన, హానికారక రసాయనాలు కలిసిన ‘హెయిర్ డై’లకు బదులు బీట్‌రూట్ రసాన్ని నాలుగైదు రోజులకోసారి తలకు పట్టిస్తే జట్టు తెల్లబడడం తగ్గుముఖం పడుతుంది. శిరోజాలకు మంచి నిగారింపు కూడా వస్తుంది. సన్నగా తరిగిన బీట్‌రూట్ ముక్కలను, కాసిన్ని ఓట్స్‌ను కలిపి మెత్తగా రుబ్బి, ఆ మిశ్రమంతో ‘ఫేస్‌ప్యాక్’ వేసుకుని అరగంట తర్వాత చన్నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు,మూడు సార్లు ఇలా చేస్తే నల్లమచ్చలు, మొటిమలు తొలగిపోయి ముఖం కాంతులీనుతుంది. బీట్‌రూట్ రసంలో కాస్త నిమ్మరసం, కోడిగుడ్డులోని తెల్లసొన వేసి బాగా కలిపి, ఆ ముద్దను ముఖంపై, మెడపై, చేతులపై మృదువుగా రాసుకోవాలి. తడి ఆరిపోయిన తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముడతలు, మచ్చలు తొలగిపోయి చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. బీట్‌రూట్ రసంలో కాస్త తేనె కలిపి రాత్రివేళ నిద్రపోవడానికి ముందు పెదాలకు రాసుకోవాలి. ఇలా కొద్దిరోజులపాటు చేస్తే పెదాలపై పగుళ్లు అంతరించిపోతాయి.