ఐడియా

జ్ఞాపకశక్తి తగ్గుతోందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరుకులు, పరుగుల నేటి ఆధునిక కాలంలో మానసిక ఒత్తిళ్ల కారణంగా చాలామంది జ్ఞాపకశక్తి సమస్యతో సతమతమవుతున్నారు. కొన్ని సులభ పద్ధతులను ఆచరిస్తే ఈ ఇబ్బంది నుంచి బయటపడవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం లేచిన వెంటనే మంచి వాసనల్ని చూస్తే ఒత్తిడి తగ్గి మెదడు తేలికవవుతుంది. ఉదయానే్న కాఫీ పొడి, తులసి ఆకులు, గులాబీ రేకులను వాసన చూడడం మంచిది. ఘాటైన వాసన కారణంగా మెదడు పదును తేలుతుంది. మంచి ఆహారం కూడా జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుంది. ఆపిల్స్, బ్లూబెర్రీస్, అరటి పండ్లు, క్యారెట్, వెల్లుల్లి తింటే మెదడులోని ఎలక్ట్రాన్స్ స్థిరంగా ఉంటాయి. వీటి జోరు అధికంగా ఉంటే జ్ఞాపకశక్తి బలహీన పడుతుంది. పీచు, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా లభించే గింజలు, చేపలను తినడం మంచిది. చదరంగం, క్విజ్, సుడోకు, పజిల్స్‌తో కాసేపు కాలక్షేపం చేస్తే మెదడులో చురుకుదనం ఏర్పడి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. రొటీన్‌కు భిన్నంగా కొన్ని విషయాల్లోనైనా సృజనాత్మకత జోడించి పనిచేస్తే మెదడు చురుగ్గా ఉంటుంది. రాత్రిపూట వీలైనంత ఎక్కువ సేపు నిద్ర పోవాలి. నిద్రలేమి సమస్య వల్ల మెదడు పనితీరు దెబ్బతింటుంది. గతం, వర్తమానం, భవిష్యత్‌కు సంబంధించిన సంఘటనలు, తేదీలు, సందర్భాలను తరచూ మననం చేసుకుంటే జ్ఞాపకశక్తి ఆశాజనకంగా ఉంటుంది.