ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి శరీరాకృతితో నాజూగ్గా ఉండాలని మగువలు తపన పడడం సహజమే. పొట్ట్భాగం పెరగకుండా ఉండాలంటే వనితలు సరైన ఆహార పద్ధతులను పాటిస్తూ రోజూ తగినంత వ్యాయామం చేస్తుండాలి. జీర్ణక్రియ సవ్యంగా ఉండేందుకు, ఎముకల దృఢత్వానికి, కొవ్వు పెరగకుండా ఉండేందుకు దోహదపడే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. బచ్చలికూరను తరచూ తింటే శరీరం బరువు తగ్గి పొట్ట్భాగం పెరగకుండా ఉంటుంది. ప్రొటీన్లు, విటమిన్-ఇ, పీచును పుష్కలంగా అందిస్తూ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే బాదం, వేరుశెనగ వంటి గింజలను తీసుకోవాలి. విటమిన్-సితో పాటు కొవ్వును కరగించే లక్షణాలున్న పండుమిర్చిని వంటల్లో విరివిగా వాడాలి. పండుమిర్చిలోని బెటా కెరెటోన్, లైకోపెన్ వంటివి బరువును తగ్గిస్తాయి. విటమిన్లు సమృద్ధిగా కలిగిన ఆపిల్స్‌ను తింటూ స్వీట్లు, కేకులు, పాల పదార్థాలు, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. బీన్స్, చిక్కుళ్లు కొవ్వును గణనీయంగా తగ్గిస్తాయి. వ్యాయామం చేస్తున్నా పొట్ట్భాగం తగ్గలేదంటే కొవ్వును కరగించే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. పొట్ట్భాగం తగ్గాలనుకునే మహిళలు తేలికపాటి వ్యాయామాలు, యోగాసనాలను రోజూ ఉదయం కనీసం అరగంట సేపు చేస్తుండాలి. ఆహారం తీసుకున్న తర్వాత కొద్దిసేపు అటూ, ఇటూ నడవాలి. రోజూ 8 నుంచి 10 గ్లాసుల మంచినీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకుపోతాయి. పంచదారతో చేసే వంటకాలకు పూర్తిగా స్వస్తి పలకాలి. ఫాస్ట్ఫుడ్‌కు బదులు తాజాపండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలను తీసుకోవాలి.