మెయిన్ ఫీచర్

‘పంచ్’ కొడితే పతకాల పంట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ బాక్సింగ్ పోటీల్లో సత్తా చూపిన పదిహేనేళ్ల నిహారిక 2020 ఒలింపిక్స్‌లో దేశానికి స్వర్ణపతకం సాధించి పెడతానని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఈ తెలుగింటి బాలిక కొద్దిరోజుల క్రితం సెర్బియాలో జరిగిన బాక్సింగ్ పోటీల్లో అసమాన ప్రతిభ చూపింది. గత నెలలో జరిగిన 5వ జాతీయ బాక్సింగ్ కప్ పోటీల్లో రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ మధ్య థైపీలో జరిగిన మహిళల జూనియర్, సీనియర్ చాంపియన్‌షిప్ పోటీల్లో రజతం సాధించింది. ఇప్పటి వరకూ ఎన్ని పతకాలు సాధించినా తనకు నిజమైన సంతృప్తి లేదని, 2017లో జరిగే యూత్ ఒలింపిక్స్‌లో, 2020 ఒలింపిక్స్‌లో బంగారు పతకాలను కైవసం చేసుకోవాలన్నదే ధ్యేయమంటోంది. ఆ కలను సాకారం చేసుకునేందుకు నిరంతర సాధన చేస్తున్నానని వివరిస్తోంది.
రష్యాలో జరిగిన ‘నేషనల్ కప్’ బాక్సింగ్ పోటీలో 27 దేశాలకు చెందిన క్రీడాకారిణులతో పోటీ పడడం ఎంతో ఆనందం కలిగించిందని నిహారిక చెబుతోంది. అంతర్జాతీయ వేదికపై అందరి ఎదుట ‘పంచ్’లతో నైపుణ్యాన్ని ప్రదర్శించాలన్న తన కల ఇన్నాళ్లకు నెరవేరిందని పదో తరగతి చదువుతున్న ఈ హైదరాబాద్ బాలిక తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తోంది. క్రీడారంగంలో తన ప్రస్థానం ఇపుడే ప్రారంభమైందని, భవిష్యత్‌లో మరెన్నో లక్ష్యాలను చేరుకోవల్సి ఉందని అంటోంది. ఒకప్పుడు తాను వాలీబాల్ క్రీడలో వరుసగా మూడేళ్లు నిమగ్నమయ్యానని, 16 ఏళ్లలోపు జాతీయ వాలీబాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించానని ఆమె గుర్తు చేస్తోంది. అయితే, బాక్సింగ్ వంటి క్రీడలో కృషి చేస్తే వ్యక్తిగత గుర్తింపు ఎక్కువగా ఉంటుందని భావించి వాలీబాల్‌కు స్వస్తి చెప్పినట్లు వివరిస్తోంది.
క్రీడాకారుల కుటుంబం నుంచి వచ్చినందున తనకు సహజంగానే ఆటలపై ఆసక్తి ఉందని, తన తండ్రి శ్రీరామ్ గోనెల హ్యాండ్‌బాల్ క్రీడాకారుడిగా జాతీయ స్థాయి పోటీలో పాల్గొని బంగారు పతకాలను సాధించినట్లు నిహారిక చెబుతోంది. తన చెల్లెలు నాగనిక కూడా బాక్సింగ్‌లో రాణిస్తున్నట్లు తెలిపింది. బాక్సింగ్‌లో సంచలనాలు సృష్టించాలని సంకల్పబలంతో కృషి చేస్తున్న నిహారిక ప్రస్తుతం విశాఖలో భారత క్రీడాసంస్థ (సాయ్) నిర్వహిస్తున్న స్పోర్ట్సు స్కూల్‌లో ఉంటోంది. బాక్సింగ్‌లో మరిన్ని మెళకువలు తెలుసుకునేందుకు ఈ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని అంటోంది. ‘ద్రోణాచార్య’ అవార్డు గ్రహీత వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో తర్ఫీదు పొందుతోంది. కుటుంబ సభ్యులను వదిలి ఇంటికి దూరంగా స్పోర్ట్సు స్కూల్‌లో ఉండడం కొంత బాధగా ఉన్నా, దేశం కోసం పతకాలు సాధించాలంటే తగిన శిక్షణ అవసరం అని చెబుతోంది. స్పోర్ట్సు స్కూల్‌లో వాతావరణం భిన్నంగా ఉంటుందని, కఠోర శిక్షణతో క్రమశిక్షణ అలవడుతుందని, ప్రతిరోజూ ఎనిమిది గంటల సేపు బాక్సింగ్‌లో సాధన చేయాల్సి ఉంటుందని నిహారిక చెబుతోంది. 15 ఏళ్ల వయసులో ఇంతగా కష్టపడడం తనకు ఎలాంటి ఇబ్బంది కలిగించడం లేదంటోంది. బాక్సింగ్‌లో ఆనందాన్ని అనుభవిస్తూ తన కలను నిజం చేసుకునేందుకు కృషి చేస్తున్నానని అంటోంది.
ఆ అపోహలు వద్దు..
ఇప్పటికీ మన దేశంలో బాక్సింగ్ క్రీడ మహిళలకు సంబంధించినది కాదని చాలామంది అపోహ పడుతుంటారని, ఇది పురుషులకు ఉద్దేశించినది కాదని తన మనసులోని మాటను తెలిపింది. బాక్సింగ్‌లో యువతులు పాల్గొనరాదన్న సనాతన భావజాలానికి ఇకనైనా తెర దించాలని అంటోంది. ఈ క్రీడ వల్ల ఎవరికైనా మంచి దేహదారుఢ్యం, మానసిక వికాసం కలుగుతాయని వివరిస్తోంది. శారీరక బలంతో పాటు మానసిక నైపుణ్యం, చాకచక్యం, వ్యూహరచన వంటివి ఉంటే యువతులు సైతం బాక్సింగ్‌లో సత్తా చాటుతారంటోంది. బాక్సింగ్‌లో మేరీ కోమ్, నిఖత్ జరీన్ తనకు స్ఫూర్తిదాతలని తెలిపింది. ఆశావహ దృక్పథం, నైపుణ్యంతో బాక్సింగ్ పోటీలకు హాజరయ్యే నిహారిక భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించడం ఖాయమని ఆమెకు కోచ్‌గా వ్యవహరిస్తున్న వెంకటేశ్వరరావు చెబుతుంటారు. బాక్సింగ్‌లో రాణించినా, చదువు పూర్తయ్యాక ఉద్యోగరీత్యా మంచి కెరీర్‌ను ఎంచుకుంటానని నిహారిక తెలిపింది.

chitram...

1. చెల్లెలు నాగనికతో నిహారిక

2. రజత పతకం చూపిస్తున్న నిహారిక

-రమ్య