ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలంతో సంబంధం లేకుండా కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగినా ఆరోగ్యానికి, చర్మ సంరక్షణకు మేలు చేస్తుందని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు.
* రక్తప్రసరణ తీరు సక్రమంగా ఉండాలంటే తరచూ కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. అధిక రక్తపోటును అరికడుతూ, గుండెపోటును నివారించేందుకు కొబ్బరి బొండం దోహద పడుతుంది. గుండె సంబంధ రక్తనాళాల్లో సమస్యలు లేకుండా, బ్లడ్ సుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.
* బరువు కోల్పోతున్నామని అనిపిస్తే కొబ్బరి నీళ్లు తాగాలి. తక్కువ కొవ్వు కలిగినందున కొబ్బరి నీళ్లను వీలైనన్ని ఎక్కువ సార్లు తాగడం ఉత్తమం.
* అనేక పోషకాలు, విటమిన్లు ఉన్నందున కొబ్బరి నీళ్లు తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. వైరస్‌లు, బాక్టీరియాల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు.
* గర్భిణులు తరచూ కొబ్బరి నీళ్లు తాగితే గుండెలో మంట, అజీర్తి వంటి సమస్యల నుంచి బయటపడొచ్చు.
* పలు రకాల ఖనిజాలున్నందున కొబ్బరి నీళ్లు తాగితే కిడ్నీ సంబంధ వ్యాధులున్న వారికి ఉపశమనం కలుగుతుంది. మూత్ర సంబంధ సమస్యలను కూడా ఇది నివారిస్తుంది.
* రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి నీళ్లను ముఖంపై రాసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. చేతులు, గోళ్లకు రాసుకుంటే మంచి నిగారింపు వస్తుంది. *