ఐడియా

బురఖాతో బార్బీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమారు ఆరు దశాబ్దాలుగా విశ్వవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన ప్లాస్టిక్ బొమ్మ ‘బార్బీ’ ఇపుడు కొత్త రూపంలో దర్శనం ఇస్తోంది. సహజమైన తెలుపురంగులో అమెరికా బాలికను గుర్తుచేసే ఈ బొమ్మ ఇపుడు తలపై బురఖాతో వినూత్న అందాలను సంతరించుకుంది. బురఖా (హిజబ్) ధరించిన దీన్ని ఇపుడు సామాజిక మీడియాలో ‘హిజార్బీ’గా వ్యవహరిస్తున్నారు. హనీఫా ఆదామ్ అనే 24 ఏళ్ల వైద్య విద్యార్థిని రంగులను మేళవించి తన కుంచెతో ‘హిజార్బీ’ని సృష్టించి అందరినీ అబ్బురపరచింది. సాంప్రదాయ బార్బీకి భిన్నంగా పొడవైన దుస్తుల్లో, తలపై ముసుగు వేసుకున్న ‘హిజార్బీ’ ముస్లిం బాలికకు ప్రతిరూపంగా కనిపిస్తోంది. వస్తధ్రారణలో అచ్చం తనలానే ఉన్నట్లు బార్బీని సృష్టించి ‘ఇన్‌స్టాగ్రామ్’లో ఉంచినట్లు హనీఫా చెబుతోంది. బ్రిటన్‌లో ఫార్మకాలజీలో పీజీ చేసిన ఆమెకు ‘హిజార్బీ’ కారణంగా అపుడే ఇన్‌స్టాగ్రామ్‌లో 19,400 మంది అనుచరులు ఏర్పడ్డారు. ముస్లిం బాలికలకు ఆదర్శంగా ఉండాలన్న భావంతోనే బార్బీని బురఖాతో తీర్చిదిద్దానని హనీఫా తెలిపింది. తప్పుడు అభిప్రాయాలను తొలగించేందుకు బొమ్మలు ఎంతగానో ఉపయోగపడతాయని, మతాన్ని చాటుకునేందుకే ముస్లిం బాలికలు బురఖాను ధరిస్తారన్న వాదనలో అర్థం లేదని ఆమె అంటోంది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్నందునే బార్బీ బొమ్మతో తన మనోభావాలను ఆవిష్కరించినట్లు చెబుతోంది.