ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దగ్గు, ఇన్‌ఫెక్షన్ల సమస్య నుంచి ఉపశమనం పొందేందుకే కాదు.. శరీరంలో అదనపు బరువును తగ్గించుకునేందుకు తేనె దివ్యౌషధంలా పనిచేస్తుంది. తేనెలో తీపిదనం (సుగర్) ఉన్నప్పటికీ కొన్ని పద్ధతుల్లో దాన్ని వినియోగించుకుంటే బరువు సమస్యను అధిగమించే అవకాశాలున్నాయని తాజా అధ్యయనాల్లో తేలింది. కాచి చల్లార్చిన నీటిలో లేదా నిమ్మరసంలో తేనె వేసుకుని తాగితే సుగర్ ప్రభావం ఉండదు. కాఫీ, టీల్లో పంచదారకు బదులు కాస్త తేనె కలుపుకుని తాగడం అలవాటు చేసుకుంటే కొన్నాళ్లకు శరీరం బరువు తగ్గుతుంది. తేనెలోని యాంటీ ఆక్సిడెంట్లు, బ్యాక్టీరియా నిరోధక గుణాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఫలితంగా రోగనిరోధక శక్తి పెరిగి హృద్రోగాలు, క్యాన్సర్ల బెడద తప్పుతుంది. ఇందులోని విటమిన్లు, ఖనిజాలు కొవ్వును కరిగిస్తాయి గనుక బరువు సమస్య తగ్గుముఖం పడుతుంది. చర్మవ్యాధులు, చుండ్రు రాకుండా అరికట్టడంలోనూ తేనె దోహదపడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రాత్రివేళ చన్నీటిలో కాస్త తేనె కలుపుకుని తాగితే మంచినిద్ర పడుతుంది.