ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాకాహారం తీసుకునేవారు ఆకుకూరలు, కూరగాయలపైనే పూర్తిగా ఆధార పడకుండా శరీరానికి పోషకాలు అందించే గింజలు, పాల ఉత్పత్తులు, తాజా పండ్లను విరివిగా వాడుతుండాలి. బాదం, వేరుశనగ, బటానీలు వంటివి తీసుకుంటే శరీరానికి కావల్సిన పీచు పదార్థాలు, విటమిన్లు, ప్రొటీన్లు, ఖనిజాలు అందుతాయి. గుడ్లు, పాల ఉత్పత్తులను తరచూ తీసుకుంటే కాల్షియం, విటమిన్-డి సమృద్ధిగా శరీరానికి లభిస్తాయి. బీన్స్, చిక్కుడులో ఖనిజాలు, విటమిన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఓట్స్, గోధుమలతో చేసిన వంటకాల వల్ల జింక్, కాపర్, ఐరన్ వంటి ఖనిజాలు శరీరానికి అందుతాయి. తాజా పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. ప్రతిరోజూ ఓ కప్పుడు ఉడకబెట్టిన బీన్స్ లేదా పప్పు ధాన్యాలు తింటే మంచిది. మధుమేహం తగ్గేందుకు ఆహారంలో విరివిగా వెల్లుల్లిని వాడాలి. గ్లూకోజ్ స్థాయిలను వెల్లుల్లి అదుపులో ఉంచుతుంది. రోజూ కాస్త ఖర్జూరం తింటే మలబద్ధకం సమస్య తీరుతుంది. ఆపిల్, జామ, క్యారెట్, తోటకూర రసం రాత్రివేళ తాగితే నిద్ర పట్టకపోవడం అనే సమస్య ఉండదు. ఎండవేళ బయటకు వెళ్లినపుడు దోసకాయ, క్యారెట్ ముక్కలు తింటే ఆకలి వేయదు. తరచూ మిరియాలు, ధనియాల కషాయం తాగితే గొంతు, చర్మ సంబంధ సమస్యలు తలెత్తవు.