ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు సమృద్ధిగా ఉండాలి. పోషకాల్లో ఇవి ఎక్కువగా ఉండేలా తగిన ఆహారాన్ని ఎంచుకోవాలి. విటమిన్ మాత్రలను వేసుకోవడానికి అలవాటు పడడం కన్నా, అవి పుష్కలంగా లభించే ఆహారాన్ని విధిగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ముందుగా రోగనిరోధక వ్యవస్థ బలోపేతం కావాలి. ఇందుకు విటమిన్లతో కూడిన సమతుల ఆహారం అనునిత్యం తీసుకోవాలి. ఇన్‌ఫెక్షన్లు, ఇతర అనారోగ్యాలకు దూరంగా ఉండాలంటే విటమిన్-సి అందించే పాలకూర, క్యాబేజీ, అనాస, బొప్పాయి, నారింజ, బత్తాయి, నిమ్మ, మామిడిపండు వంటివి తరచూ తీసుకోవాలి. బాదం, వేరుశెనగ, బఠాణీలు, ఇతర గింజలను తీసుకుంటే విటమిన్-ఇ శరీరానికి తగినంతగా అందుతుంది. మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే విటమిన్-ఇ ఇన్‌ఫెక్షన్లను నివారిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచేలా విటమిన్ బి-6 కూడా మనం తీసుకునే పోషకాల్లో తప్పనిసరిగా ఉండాలి. పిస్తా, పాలకూర, చికెన్, చేపలు, గుడ్లు వంటి ఆహారంలో ఇది ఎక్కువగా లభిస్తుంది.