ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ శరీరానికి జింక్ ఎంతో అవసరం. పుట్టే బిడ్డ పిండంగా ఉన్నప్పటి నుంచే గర్భిణీ తగు మోతాదులో జింక్ తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు సైతం సూచిస్తున్నారు. ప్రతివారికీ రోజుకు కనీసం 15 మిల్లీ గ్రాముల జింక్ కావలసి ఉంటుంది. సాధారణంగా మనం తినే ఆహార పదార్థాల ద్వారా లభించే జింక్ శరీరానికి సరిపోతుంది. పళ్ళు, పప్పు దినుసులు, ఆకు కూరలు, పాలు, క్యాబేజీ, బంగాళాదుంప, బీట్‌రూట్, వేరుశనగలోనూ జింక్ పుష్కలంగా లభిస్తోంది. జింక్ లోపం ఏర్పడితే అనారోగ్యాలు కలుగుతాయి. ముఖ్యంగా మూత్రపిండాలు, జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయాలంటే జింక్ కావాలి. జింక్ లోపం వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపిస్తోంది. పిల్లల్లోకానీ, పెద్దలలో కానీ జింక్ లోపం ఏర్పడితే చర్మం మృధుత్వాన్ని కోల్పోయి బిరుసవుతుంది. ఆకలి తగ్గిపోయి, ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. దీనివల్ల వారికి నీరసం, పనిచేస్తుంటే అలసట ఏర్పడతాయి. గర్భిణీలకు, పాలిచ్చే బాలింతలకు మిగిలినవారి కంటే కొంతశాతం జింక్ అవసరం ఎక్కువ. జింక్ లభించే పదార్థాలు వారు తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. కండరాలకు, కాలేయానికి, కంటి చూపుకు తోడ్పడే జింక్ లోపిస్తే ఆకలి మందగించి అలసటకు దారితీస్తుంది . తస్మాత్.. జాగ్రత్తా..!

-కె. నిర్మల