ఐడియా

మధుమేహానికి చెక్ పెట్టే బార్లీ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బార్లీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఇటీవల నిర్వహించిన ఒక స్టడీలో ఈ విషయం వెల్లడైంది. బ్లడ్ షుగర్ ప్రమాణాలు తగ్గించడం ద్వారా డయాబెటిస్ రిస్కు లేకుండా చేస్తుందిట. ది లండ్ యూనివర్సిటీవారు ఈ అధ్యయనాన్ని చేశారు.
బార్లీలో డయటరీ ఫైబర్స్ బాగా ఉండడాన్ని అధ్యయనకారులు గుర్తించారు. ఇది ఆకలిని కూడా బాగా నియంత్రిస్తుంది. అంతేకాదు కార్డియో వాస్క్యులర్ జబ్బుల పాలబడకుండా కాపాడుతుంది. ఈ స్టడీని ఆరోగ్యవంతులైన మధ్యవయస్కుల మీద చేశారు. వారిని బార్లీతో తయారుచేసిన బ్రెడ్‌ను బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌గా మూడురోజులపాటు తినమన్నారు. పధ్నాలుగు గంటల తర్వాత వారిలో డయాబెటిస్, కార్డియోవాస్క్యులర్ జబ్బుల ఇండికేటర్స్‌ను పరిశీలించారు. బార్లీ బ్రెడ్ తిన్న తర్వాత గట్‌లో హార్మోన్లు పెరిగాయి. ఈ హార్మోన్లు జీవక్రియని, ఆకలిని క్రమబద్ధీకరిస్తాయి. హార్మోన్లు పెరగడంవల్ల కడుపులో ఉండే క్రానిక్ మంట కూడా తగ్గుతుంది. ఫలితంగా డయాబెటిస్, కార్డియోవాస్క్యులర్ జబ్బుల రిస్కు బాగా తగ్గుతుంది. బ్లడ్ షుగర్ కూడా నియంత్రణలో ఉండడానికి తృణధాన్యాలతో చేసిన బ్రెడ్‌ని తినాలి. బియ్యం పిండికి దూరంగా ఉంటే మంచిది. బార్లీని సూప్స్‌లో, స్ట్యూస్‌లలో కూడా వాడొచ్చు. అన్నం బదులు బార్లీని ఉడకేసుకుని తినొచ్చు. ఆహారంతోపాటు బీన్స్, శెనగలు తింటే మంచిది. వీటిల్లో డయాటరీ ఫైబర్స్ బాగా ఉంటాయి. అంతేకాదు గ్లైసమిక్ ఇండెక్స్ కూడా వీటిల్లో తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. అందుకే సరైన డయాటరీ ఫైబర్స్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని అధ్యయనకారులు అంటున్నారు. *