ఐడియా

కాగితపు ‘కళ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్విల్లింగ్ ఆర్ట్. ఇదొక కళ. ఖాళీ సమయాల్లో అద్భుతమైన కళాకృతులు చేయడానికి ఇదొక మార్గం. ఇప్పటికే ఎంతోమందిని ఆకర్షిస్తున్నది. దీన్ని పేపర్ ఫిలిగ్రీ అని కడా పిలుస్తారు. టర్కీ దేశపు ఇస్తాంబుల్ నగరానికి చెందిన ‘సెనరూన’ అనే అమ్మాయి చేతిలో రూపుదిద్దుకున్నవే ఈ కాగితపు కళారూపాలు. మొదట సరదాగా కాగితంతో బొమ్మలు చేసినా తరువాత తనకి వచ్చిన గుర్తింపు, ప్రోత్సాహంతో చేస్తున్న ఉద్యోగం వదిలి పూర్తిస్థాయిలో ‘క్విల్లింగ్ పేపర్ ఆర్ట్’లో మునిగిపోయింది. ఇంటిని అలంకరించే ఫ్రేమ్స్, వాల్ హాంగింగ్స్, ఫ్లవర్స్, పిల్లల బొమ్మలు వంటివి క్విల్లింగ్ లేదా ఫిలిగ్రీ ఆర్ట్ విధానంలో తయారుచేసి ప్రస్తుతం రెండు చేతులా సంపాదిస్తోంది. కాస్త సమయాన్ని వెచ్చించగలిగితే అందమైన కళాకృతులను తయారుచేసుకోవచ్చు. వందలు, వేలు ఖర్చుచేసి కొనేవాటికంటే చిన్నపాటి ఖర్చుతో చేసుకునే ఈ అలంకరణ వస్తువులు మనోల్లాసాన్ని కలిగిస్తాయి. అంతేకాదు మన ఇంటిని మనం తయారుచేసిన వస్తువులతో అలంకరించుకున్నామన్న సంతృప్తి కూడా కలుగుతుంది అనే ‘సెనరూన మాటలతో మనమూ ఏకీభవించి సరికొత్త ఆలోచనలకి శ్రీకారం చుట్టేద్దామా!

-టి.మూర్తి