ఐడియా

ఆరోగ్యానికి సోంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిమళ ద్రవ్యంగా పరిగణించే సోంపును మసాలా దినుసుల్లో వాడతారు. వీటిలో కాల్షియం, ఐరన్, సోడియం, ఫాస్పరస్, పొటాషియం, ధయామిన్, రిబోఫ్లోవిన్, నియాసిన్, విటమిన్-సి, పార్మిటిక్ ఆమ్లం, పెట్రోసెలినిక్ ఆమ్లం వంటి పోషకాలు లభిస్తాయి. సోంపును తమలపాకులతో కలిపి తాంబూలంలో వేసుకుంటారు. ఔషధగుణాలున్న సోంపును గృహవైద్యంలో ప్రముఖంగా వాడతారు. భోజనం తర్వాత కాస్త సోంపు తింటే ఆరోగ్యరీత్యా మంచిది.
- ఇది ఆకలిని పెంచుతుంది, మలబద్ధకాన్ని పోగొడుతుంది. అరుచిని తొలగిస్తుంది.
- మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది.
- కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఊపిరితిత్తులలో పేరుకున్న కఫాన్ని కరిగిస్తుంది. వికారాన్ని పోగొడుతుంది. అజీర్ణం వల్ల ఏర్పడిన కడుపునొప్పి తొలగిపోయి సుఖ విరేచనమవుతుంది.
- సోంపు కషాయంలో పాలను చేర్చి తాగితే కంటి ఆరోగ్యం బాగుంటుంది. కంటి ఉబ్బు, వాపు తగ్గిపోతాయి.
- వాంతులను నివారిస్తుంది. నోటి దుర్వాసనను అరికడుతుంది.
- సోంపు కషాయాన్ని తాగితే స్ర్తిలలో రుతు సంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి.
- సోంపు కషాయంలో పటికబెల్లం పొడి వేసి వడ కట్టి పిల్లలకు తాగిస్తే పిల్లల్లో జీర్ణశక్తి పెరుగుతుంది.

-కె.నిర్మల