ఐడియా

వంటపాత్రలు శుభ్రంగా ఉండాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వంట పాత్రలు చక్కగా ఉండాలంటే సగానికి తరిగిన నిమ్మకాయ ముక్కని సాధారణ ఉప్పులో ముంచి బాగా రుద్దాలి. ఆ తరువాత ఒక పొడి గుడ్డతో గినె్నలో తడి లేకుండా తుడుచుకోవాలి.
* తవ్వా, కడాయి, పాలకుక్కుర్- ఇలా కాగే నూనె కోసం, మరిగే పాల కోసం ప్రతి పూటా వాడే పాత్రలు శుభ్రపరచుకోవడానికి ఇంట్లో వాడే కొబ్బరిపీచుకి బదులు మార్కెట్లో అందుబాటులో వున్న అల్యూమినియం ఫాయిల్ని వినియోగించడం ఉత్తమం. కాస్త వేడిగా ఉన్నపుడే ఈ పాత్రలని చింతపండుతో రుద్ది సులభంగా శుభ్రపరచుకోవచ్చు.
* ఒకప్పుడు వాడినంతగా ఇత్తడి పాత్రలు ఇప్పటి వంటిళ్ళలో లేవనే చెప్పాలి. వాటి తయారీలో నాణ్యత లోపిస్తే అవి ఆహారాన్ని విషతుల్యం చేయడమే దీనికి ప్రధాన కారణం. కానీ, పూజామందిరంలో ఇంకా ఇత్తడి వస్తువులు దర్శనం ఇస్తున్నాయి. ఇవి కాంతులీనడానికి ఆవనూనెలో పసుపు ముద్ద వేసుకుని కడిగి శుభ్రపరచుకోవాలి.
* కుక్కర్, పాన్, ఇతర పాత్రలతో వంట చేసుకునే ప్రెషర్ కుక్కర్, పాన్ అడుగున పోసే నీటితోపాటు వాడేసిన నిమ్మ తొక్కలని వేస్తే కింద నలుపుదనం చేరకుండా ఉంటుంది.
* కుంకుమభరిణి, ఉద్ధరణి, పంచపాత్రలు- ఇలా దేవుడి గదిలో వాడే వెండి పూజా వస్తువులను శుభ్రం చేసుకోవడానికి ముగ్గుపిండి, కుంకుడుకాయ రసం వంటి వాటిని వాడుకోవచ్చు. అయితే, వీటిని చల్లటి నీటితో కడగడం మంచిది.

-మురళీకృష్ణ