ఐడియా

టీవీ మీద మరకలు పోవాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎలక్ట్రానిక్ రంగం అభివృద్ధి చెందడంతో ‘బుల్లితెర’ పలు మార్పులను చోటుచేసుకుంటోంది. ఒకప్పుడు సిఆర్‌టి సాంకేతికతతో పనిచేసిన టెలివిజన్ ఇప్పుడు ఎల్‌సిడి, ఎల్‌ఇడి, ప్లాస్మా ఇలా కొంగ్రొత్త అవతారాలెత్తింది. వీటి శుభ్రతలో తగిన శ్రద్ధ, సరైన మెలకువలు అవసరం.
* టీవీని ఆఫ్ చేసుకుని కాసేపయ్యక నల్లని రంగులోకి మారిన తెరపైకి చూస్తే దుమ్ము, ధూళి కనిపిస్తాయి. ఆ మురికి రోత పుట్టించడమే కాకుం డా మన కంటికి కీడు కలిగిస్తాయని మరవద్దు.
* మెత్తటి తెల్లని పొడి గుడ్డని వినియోగించి టీవీ ముందు భాగాన్ని పైనుంచి కిందకు నెమ్మదిగా తుడుచుకోవాలి. తరచూ శుభ్రం చేస్తుంటే దుమ్ము, మరకలు చేరే అవకాశం ఉండదు.
* తుడవడంలో ఏ మాత్రం ఏమరుపాటు వహించినా లిక్విడ్ క్రిస్టల్ డిస్ ప్లే దెబ్బతినే ప్రమాదముంది.
* మరకలు మరీ మొండివైతే తుడిచే మెత్తని బట్టని తడపకుండా, కొన్ని చుక్కల డిస్టిల్డ్ వాటర్ ఉపయోగించుకోవచ్చు.
* మార్కెట్లో లభ్యమయ్యే ఎల్‌సిడి క్లీనింగ్ స్ప్రేని నేరుగా టీవీపైకి చిమ్మకుండా గుడ్డపై చల్లి వాడుకోవాలి.
* తెర చుట్టూ రక్షణగా వున్న ప్లాస్టిక్ చట్రం, మిగతా భాగమంతా తళ తళా మెరవడానికి ఇంట్లో అందుబాటులో ఉన్న ఏదైనా లిక్విడ్ క్లీనర్‌ని వినియోగించుకోవచ్చు. ఇది టీవీ లోపలికి చేరకుండా జాగ్రత్తపడాలి.
* ఏదో ఒక బట్ట అని , టిష్యూ పేపర్లని వాడితే తెరపై గీతలు పడడం ఖాయం. అమ్మోనియా, ఇథైల్ ఆల్కహాల్, ఎసిటోన్, ఇథైల్ యాసిడ్ లాంటి రసాయనాలను టీవీలను శుభ్రపరచడంలో వినియోగించకూడదు. అవి టీవీ రంగులనే శాశ్వతంగా మార్చిపడేసే ప్రమాదం ఉంది. *