ఐడియా

మండు వేసవిలో పిల్లల సంరక్షణ ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలు వేసవిలో పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తరచూ అనారోగ్యం పాలవుతారు. బయట వాతావరణం చాలా వేడిగా ఉండడం, తద్వారా పిల్లల శరీర ఉష్ణోగ్రత పెరగడం, ఎక్కువ చెమటతో వంట్లో నీరు వేగంగా ఆవిరైపోవడం.. ఇవి వడదెబ్బకు దారితీస్తాయి. ఇంట్లో ఉండే చిన్నపిల్లల విషయంలోనూ జాగ్రత్త అవసరం.
చర్మంపై పేరుకుపోయిన వ్యర్థాల వల్ల చెమట పొక్కులు, ఇన్‌ఫెక్షన్‌తో సెగగడ్డలు వస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే జ్వరం వచ్చే అవకాశం లేకపోలేదు. అందుకని స్నానం చేశారు కదాని నిర్లక్ష్యం చేయక మొఖం, కాళ్లు, చేతులు చల్లని నీటితో కడుగుతూ ఉండాలి. ఎండాకాలం వచ్చే వ్యాధులు ఒకరినుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తాయి. కళ్ళకలక, గవద బిళ్ళలు, టైఫాయిడ్, పొంగు, అతిసార, కామెర్లు ఎక్కువగా వ్యాపిస్తాయి.

* ఉదయం, సాయంత్రం ఎండలేని సమయాల్లోనే పిల్లలను బయటికి అనుమతించడం, తీసుకెళ్లడం చేయాలి. ఎండ సమయంలో పిల్లలకి కథలు చెప్తూ, రైమ్స్, పాటలు పాడిస్తూ, పుస్తకాలు చదివిస్తూ, బొమ్మలు వేయిస్తూ, ఇంట్లో ఆడుకునే ఆటలు ఆడిస్తూ.. కాలక్షేపం చేయాలి.
* ఇంట్లోకి వేడిగాలి నేరుగా చొచ్చుకురాకుండా చుట్టూ మ్యాట్‌లు వేలాడదీయాలి. ఇవి పూర్తిగా తడి ఆరిపోకుండా చూసుకోవడం వల్ల గదులన్నీ చల్లని వాతావరణాన్ని సంతరించుకుంటాయి.
* పిల్లలకి రెండు పూటలు తప్పక గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. శరీరంలో ఎక్కువ వేడి ఉన్నట్టయితే తడిబట్టతో తుడుస్తూ మామూలు స్థితికి తీసుకురావాలి.
* గాలి ప్రసరణమయ్యే పలుచటి, మెత్తటి కాటన్ దుస్తులు వేయాలి. బయటికి వెళ్లాల్సి స్తే గొడుగు టోపీ, గాగుల్స్ తప్పక వాడాలి.
* పిల్లలు ఆటల్లో పడి నీరు తాగడం మర్చిపోవచ్చు. దాహంతో సంబంధం లేకుండా మంచినీరు పట్టిస్తూ ఉండాలి. కొబ్బరినీళ్ళు, బార్లీ, సబ్జా, సగ్గుబియ్యం.. తదితర ద్రవాలు తాగించాలి. సీజనల్ ఫ్రూట్స్, అన్ని రకలా ఆకుకూరలు, కూరగాయలు తినిపించాలి.
* సాధ్యమైనంత వరకు నిలువ ఆహారం జోలికి పోకుండా తాజా ఆహారం మాత్రమే పెట్టాలి. సకాలంలో టీకాలన్నీ వేయించి ఆయా వ్యాధులన్నిటినీ నిరోధించాలి.

-మురళీకృష్ణ