ఐడియా

గుండె జబ్బులు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన రోజువారీ ఆహారంలో కొలెస్ట్రాల్ వినియోగం ఎటువంటి పరిస్థితులలోను 300 మిల్లీ గ్రాములకు మించకూడదు. మాంసాహారం,డైరీ ఉత్పత్తులలో ఘనీకృత కొవ్వు పదార్థాలు ఎక్కువగా వుండటంవల్ల అవి మన రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచుతాయి. వరి, గోధుమ మొదలైన వాటిల్లోని అధిక కార్బోహైడ్రేట్లు రక్తంలో కొలెస్ట్రాల్‌గా రూపాంతరం చెంది హాని కలిగిస్తాయి. ఘనీకృత (శాచురేటెడ్) కొవ్వు పదార్థాలను, మితిమీరి కార్బోహైడ్రేట్‌లను ఆహారంగా స్వీకరించేవారు ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడే అవకాశం వుంది. అందుకు విరుద్ధంగా సోయా ఉత్పత్తులు రక్తంలోని ‘లిపిడ్ లెవెల్స్’ను క్రమబద్ధం చేస్తాయి. అమెరికాలోని ఆహార ఔషధ అజమాయిషీ సంస్థ (యు.ఎస్.ఎఫ్.డి.ఎ) వారు ప్రతిరోజు 25 గ్రాముల సోయాబీన్‌ను ఏదో ఒక రూపంలో ఆహారంగా స్వీకరించటం గుండె జబ్బుల నుండి కాపాడుతున్న వాదనతో ఏకీభవించారు. కనుక సోయాబీన్ ఉత్పత్తులను క్రమబద్ధంగా స్వీకరించేవారు గుండె జబ్బుల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. సోయాలోని తక్కువ కార్బోహైడ్రేట్‌లు, ఎక్కువ ప్రొటీన్స్ శరీరంలో కొవ్వు పెరుగుదలను క్రమబద్ధీకరిస్తుంది. స్థూలకాయం బారిన పడకుండా కాపాడి సంపూ ర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.

- కాకరపర్తి సుబ్రహ్మణ్యం