ఐడియా

రక్తంలో కొవ్వు తగ్గాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రక్తంలో కొవ్వు శాతం తగ్గించుకుంటే గుండె జబ్బుల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చని, ఇందుకు ఆహార పద్ధతుల్లో మార్పులు అనివార్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆహారపు అలవాట్లను గాడిలో పెట్టగలిగితే గుండె సంబంధిత సమస్యలు దరిచేరవని వారు భరోసా ఇస్తున్నారు. రక్తంలో కొవ్వు తగ్గేందుకు కొన్ని పద్ధతులు ఆచరిస్తే మంచి ఫలితాలు కన్పిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా కలిగిన ఆలివ్ నూనెను వంటల్లో వాడడం ఉత్తమం. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఆలివ్ నూనె ఎంతగానో ఉపకరిస్తుంది. తరచూ బాదం, వాల్‌నట్స్, నానబెట్టిన గింజలను తినడం వల్ల గుండె జబ్బులకు దూరం కావొచ్చు. ఉప్పు, పంచదార కలపకుండా గింజలను తినడం ఆరోగ్యరీత్యా శ్రేయస్కరం. ఒమెగా-3 ఫాటీ యాసిడ్లు పుష్కలంగా లభించే చేపలను తరచూ తినడం వల్ల రక్తపోటు తగ్గడమే కాకుండా, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలను అధిగమించవచ్చు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను నివారించ్ఘేందుకు ఓట్స్ ధాన్యం వాడడం మంచిది. తాజా కూరలు, పండ్లు తీసుకోవడం వల్ల రక్తంలో కొవ్వు శాతం తగ్గుతూ, గుండె వ్యాధులకు అవకాశం లేనిరీతిలో ఆరోగ్యం వృద్ధి చెందుతుంది.