ఐడియా

పోషక విలువలున్న నువ్వులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ వంటకాలలో నువ్వుల వాడకం ప్రాచీన కాలం నుండి ప్రసిద్ధి చెందింది. అందుకే నువ్వుల నూనె వాడకం పట్ల మహిళలు ఆసక్తి చూపిస్తారు. నువ్వులలో అనేక పోషకాలున్నాయ.
ప్రతి పండుగలలో తెలుగువారు చేసే వంటకాలలో నువ్వుల వాడకం ప్రసిద్ధి చెందింది. సంక్రాంతి, దసరా, దీపావళి పండుగలలో నువ్వుల లడ్డూలు తయారుచేస్తారు. నువ్వులలో చేసిన జీళ్లు అంటే చాలామంది ఇష్టపడతారు. అరిసెల తయారీలో నువ్వులు వాడతారు. నాగుల చవితి పండుగకు నువ్వులు ప్రత్యేక ప్రాధాన్యత వహించాయి. నువ్వులతో చట్నీలు, పొడులు తయారుచేస్తారు. చూడడానికి చిన్నగా కనిపించే నువ్వులలో ఆరోగ్యరీత్యా అనేక ప్రయోజనాలున్నాయి. రక్తపోటును తగ్గించే గుణం వుంది. కాల్షియం, మాంగనీస్ కాపర్‌లకు ఆధారం, విటమిన్ బి కాపర్ అనే పదార్థం రుమటాయిడ్, ఆర్థ్రరైటిస్‌వల్ల కలిగే నొప్పిని వాపును నివారిస్తుంది. కొలెస్టరాల్‌ను తగ్గించే గుణాలు నువ్వులలో వున్నాయి. తెలుగువారి ప్రియమైన వంటకాలలో, పచ్చళ్ళలో నువ్వుల నూనె వాడకం ఎంతో ఉపయోగకరం. నువ్వులపొడి ఆరోగ్యకరమైనది. చైనా దేశంలో నల్ల నువ్వులంటే అధికంగా ఇష్టపడతారు. చైనా దేశస్థులు కూడా నువ్వుల నూనె వంటకాలలో ఉపయోగిస్తారు. శనిదేవుడికి నువ్వులంటే అమిత ఇష్టం.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదా ఈకింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03

- ఎల్.ప్రపుల్లచంద్ర