ఐడియా

ఆహారపు అలవాట్లే క్యాన్సర్ కారకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక మానవుడు దైనందిన జీవితంలో వత్తిడి, ఆహారపు అలవాట్లు, జీవన వైవిధ్యం లేకపోవడం వంటి కారణాలవల్ల అస్వస్థతకు గురవుతున్నాడు. మనిషిని పట్టిపీడించే ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. కొన్ని రకాల క్యాన్సర్లు ఆహారపు అలవాట్లవల్లే వస్తాయని కార్నిగే యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ క్లేర్‌షా తన పరిశోధనల్లో నిర్ధారించారు. క్యాన్సర్‌లో ప్రమాదకరమైన లుకేమియా (బ్లడ్ క్యాన్సర్)కు ఆహార అలవాట్లకు సంబంధం లేదని ఆమె తేల్చారు. అదే విధంగా స్ర్తిలలో వచ్చే గర్భాశయ క్యాన్సర్ మనం తినే ఆహారంవల్ల రాదు. కడుపు, జీర్ణాశయం, చిన్నప్రేవులు, పెద్ద ప్రేగులకు సంబంధించిన క్యాన్సర్‌లో 92శాతం ఆహారాలవల్లే వస్తుందని పరిశోధనల్లో తేలింది. భారీగా మసాలాలు, రెండుమూడుసార్లు ఉడికించే పదార్థాలు, ఆహారంపై మంట పెట్టి వం డే పదార్థాలు, మెత్తటి పిండి పదార్థాలు, సరిగ్గా ఉడకని మాంసాహారం క్యాన్సర్‌కు కారణాలవుతాయని డాక్టర్ల పరిశోధనల్లో స్పష్టమైంది. హార్మోన్ల తేడాలవల్ల వచ్చే రొమ్ము, ప్రోస్ట్రేట్ క్యాన్సర్లు కూడా ఒకోసారి స్థూలకాయంవల్ల వస్తుంది. స్థూలకాయం 90శాతం ఆహారపు అలవాట్లువల్లే వస్తుంది.