ఐడియా

ఐదు సూత్రాలతో ఆరోగ్యం పదిలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరీరంలోని అవయవాలు రోజంతా చురుగ్గా పనిచేయాలంటే ఐదు సూత్రాలు పాటిస్తే చాలు ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.
* వ్యాయామం ప్రతి ఒక్కరికీ అవసరం. వాకింగ్‌కు వెళ్లినపుడు వీలైనంత ఉదయానే్న అంటే 4.30 నుంచి 5.00 గంటల్లోపే ముగించడం ఎంతో మేలు. ఆ సమయాన పెద్దగా వాహనాల రాకపోకలు ఉండవు. వాకర్లే తప్ప ఇతర హడావుడి కనిపించదు. అప్పుడే పచ్చని చెట్లనుంచి వెలువడుతున్న ప్రాణవాయువు ఆయుష్షును మరింతగా పెంచుతుంది. దుమ్ము, ధూళి లేచి వుండదు. ఒకవేళ వాతావరణంలో మంచు ఎక్కువగా వుంటే, అందుకు అవసరమైన దుస్తులు ధరించడం ఉత్తమం.
* ఇక ఉద్యోగరీత్యా, లేదా పనుల మీద బయటకు వెళ్లినపుడు చలువ కళ్ళద్దాలు తప్పనిసరిగా వినియోగించాలి. ఎండాకాలంలోనే చలువ కళ్ళజోళ్ళు వాడాలన్న నిబంధన ఎప్పుడో మటుమాయమైపోయింది. వాహనాల మీద వెళ్ళేటప్పుడు టూ వీలరైతే ట్రాఫిక్ రూల్స్ మేరకు హెల్మెట్ పెట్టుకోవడంవల్ల అపరాధ రుసుం తప్పుతుంది. పైగా దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే చిన్న చిన్న గాయాలతో ప్రాణాలు నిలుపుకోవచ్చు. అలాగే ధ్వని, వాయు కాలుష్యం నుంచి తప్పించుకొని ఇతరులకు మనం మార్గదర్శకులుగా నిలువవచ్చు.
* దేవుడు ఇచ్చిన సుకుమారమైన కాళ్ళ పాదాలను, చేతివేళ్ళను ఎండబారినుంచి కాపాడుకోవాలంటే చేతికి గ్లౌజులు, కాళ్ళకు షూలు తప్పక ధరించాలి. అలాగే శరీరానికి తగినంతగా గాలి తగిలేలా సున్నితమైన కాటన్ దుస్తులు వేసుకుంటే చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చును.
* వైద్య నిపుణుల సలహా మేరకు ఒక మనిషి రోజుకు ఎనిమిది లీటర్ల నీరు తీసుకోవాలి. ఇందుకుగాను తోడుగా చిన్న సీసాలో నీరు కూడా ఉండాలి. దాహం వేస్తే ఎక్కడికక్కడే నీరు తీసుకోవడంవల్ల లేనిపోని సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదాలు లేకపోలేదు.
అవసరార్థం ఇంటి సామగ్రికోసం (తక్కువగా ఉంటే) ఇంటినుంచి బ్యాగ్‌ను తీసుకువెళ్లడం వల్ల ధనం పొదుపు పాటించిన వారవుతాం. అలాగే ప్లాస్టిక్ వాడకుండా పరోక్షంగా పర్యావరణానికి మేలు చేసినట్లవుతుంది. ఇప్పటికే నగరాల్లో, గ్రామాల్లో రోజురోజుకూ పెరిగిపోతున్న వ్యర్థ పదార్థాల నిర్వహణలో ఆయా సంస్థలు విఫలమవుతున్నాయి. దీనివల్ల ఎక్కడికక్కడే మురికి పేరుకుపోయి దోమలకు నివాసాలుగా మారుతున్నాయి.
* కంప్యూటర్లు, టీవీలు, సెల్‌ఫోన్లు ఎన్ని దూసుకొచ్చినా పుస్తకానికి వున్న విలువ చెరిగిపోలేదు. అందుకే పుస్తకం మనిషికి ఒక మంచి స్నేహితుడని ఎందరో కవులు వర్ణించారు. మనం పనిమీద బయటకు వెళ్లినపుడు పని జాప్యం అయ్యేటప్పుడు విసుగు, చిరాకు రాకుండా ఉండేందుకు చేతిలో పట్టుకువెళ్లిన పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది. మనస్సు, మెదడు ప్రశాంతంగా ఉంటుంది. గడిచిపోయిన టైం తెలియనివ్వదు. చేతిలో పుస్తకం ఉండడం ఎంతో హాయే.
ఈ సృష్టిలో ఒక్క మనిషికే ఆ భగవంతుడు మాటతోపాటు శరీర సౌందర్యన్ని ప్రసాదించాడు. దీనిని కాపాడుకోవడం మన చేతిల్లో వుంది. సహజమైన వనరులు, చిట్కాలు జాగ్రత్తలతో శరీర ఛాయని కాపాడుకోవచ్చును. ఇదీ ఒక కళే.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- జి.కల్యాణి