ఐడియా

తలపోటుకు ఇంటి వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలనొప్పి వల్ల వచ్చే బాధను తట్టుకోవడం చాలా కష్టం. అదే పార్శ్వపు నొప్పిగాని, మైగ్రేన్ తలనొప్పిగాని అయితే ఆ బాధ వర్ణనాతీతం. తలనొప్పి రానివారు బహు అరుదు. మెడమీద తల ఉన్న ప్రతివారికి తలనొప్పి ఏదో సమయంలో రాకమానదు. ఇది ఒక జబ్బు కాదు. ఒక వ్యాధి లక్షణం. ఫల పుష్పాలు, కూరలు, మసాలా దినుసులతో తలనొప్పిని తగ్గించుకోవచ్చు.
పుదీనా ఆకులను ముద్దగా నూరి నుదురు, కణతలకు పట్టువేయాలి.
వెలగచిప్ప గంధం కణతలకు పూస్తే వెంటనే తగ్గుతుంది.
ఘులరాకు రసంలో మిరియాల పొడి కలిపి కణతలకు పట్టించడం.
దాల్చిన చెక్క పేస్టును నుదుటికి పట్టించడం.
ఉసిరి ముద్దను తలకు పట్టువేయడం.
సీతాఫలం ఆకుల రసం తలకు మర్దనా చెయ్యడం
నుదుటిమీద పసుపు రాయడం.
లవంగాలు నూరి పట్టు వేస్తే తీవ్రమైనది కూడా తగ్గుతుంది.
పచ్చి పసుపు బాగా నూరి తలకు పట్టించడం.
ఆపిల్ పండు పైతొక్క తీసివేసి మిగిలిన దానిని ఉప్పులో అద్దుకు తింటే ఏ రకమైనదైనా తగ్గును.
కానుగ నూనె, మరియాలతో నూరి పట్టులా వెయ్యడం.
గుంటకలగరాకు మొక్క, మిరియాలు ముద్దగా నూరి నుదుటిపై పూయుట
ఉసిరి పప్పు నీటితో నూరి కణతలకు పట్టించడం.
గురివిందను కుంకుడు గుజ్జుతో అరగదీసి కణతలకు పట్టించాలి.
దబ్బ ఆకులు విస్తరిలా తయారుచేసి తలకు చుట్టిన అసాధ్యమైనవి కూడా తగ్గుతాయి.
కస్తూరి, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు కలిపి తలకు పట్టించడం
గుంటకలగరాకు రసంలో నూనె కలిపి తలకు రాసుకోవాలి.
గోరింట ఆకు ముద్దలో కొద్దిగా నూనె, తుమ్మ జిగరు కలిపి పట్టువేస్తే మంచి ఉపశమనం
నార దబ్బ ఆకు చితుకకొట్టి, కొంచెం వెచ్చ చేసి తలకు కట్టడం.
మాచిపత్రి ఆకుతో కట్టు కట్టడం
వస గంధం కణతలకు పట్టించడం.
తులసి ఆకుల కషాయం నుదుటిపై రాసుకుంటే మంచి ఉపశమనం
వేడి పుదీనా టీ తలనొప్పులనుండి ఉపశమనం
శొంఠి కొమ్ము పాలతో అరగదీసి తలపై పట్టు వెయ్యడం.
తులసి ఆకుల ముద్దను గంధంలో కలిపి తలకు రాసుకోవడం
శొంఠి, ఆముదం వేరు మెత్తగా నూరి తలకు పట్టువెయ్యడం.
శొంఠిపొడిని పాలలో కలిపి 3-4 చుక్కలు ముక్కులో వేసి బాగా పీల్చాలి.
వావిలి ఆకులను తలగడగా చేసికొని పరుంటే తలనొప్పి, జలుబు తగ్గుతాయని గిరిజనుల నమ్మకం.
లవంగ పొడి, అల్లపు రసం, తేనె కలిపి తీసుకుంటే తలనొప్పులు, వాంతులు తగ్గుతాయి.
ఏలకుల కషాయం త్రాగితే తలనొప్పి, వికారం, తగ్గుతాయి.
నల్లజీలకఱ్ఱ పొడి చిన్న మూటగా కట్టి వాసన చూస్తే తలనొప్పి జలుబు తగ్గుతాయి.
అవిశ ఆకుల తాజారసం కొద్దిగా ముక్కుతో పీల్చితే తలనొప్పి, జలుబు నయం అవుతాయి.
మంచి గంధం, హారతి కర్పూరం నూరి కణలకు పట్టిస్తే సైనస్‌వల్ల వచ్చే తలనొప్పి తగ్గును.
అజీర్ణపు తలనొప్పికి ఏలకుల టీ తాగాలి.
మద్యం సేవించగా వచ్చిన హాంగ్‌ఓవర్ తలనొప్పికి, కప్పు టీలో కొంచెం నిమ్మరసం కలిపి తాగాలి.
పిత్తాశయ లోపంతో వచ్చే తలనొప్పులకు చింతపండు రసంతో పంచదార కలుపుకు తాగాలి.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- గురునాధరాజు