ఐడియా

చిట్కా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవికాలంలోనే ఊరగాయలు, పచ్చళ్లు పెడతారు, కారణం- ఎండలు మిక్కుటంగా వుండి, నాలుగు కాలాలపాటు అవి వాడుకోవచ్చును. వర్షాకాలంలో అయితే నిమ్ము, తడి కలిగి బూజుపట్టడమో, కలర్ మారటమో జరుగుతుంది.
* వేసవికాలంలో ధర ఎక్కువైనా నిమ్మకాయలు చిన్నవి, మధ్యసైజువి, గజ నిమ్మకాయలు, పచ్చగా బంగారు కాంతితో రంగుతో వస్తాయి. వాటితో ఊరగాయలు, నిమ్మ పచ్చడి (రసంతో) చేసుకోవచ్చు. అర్జెంటు పనుల్లో వుండి వాటిని బేసిన్లు లోపలపెట్టి వుంచుతారు. అలా చేస్తే కొన్ని గట్టిపడి, రంగు వెలిసి, కొన్ని మెత్తపడిపోతాయి. అలాకాకుండా నిమ్మకాయలు తాజాగా మెత్తబడకుండా ఉండాలంటే వాటిని చల్లటి నీటిలో వుంచి ఆ నీటిని ప్రతిరోజూ మారుస్తూ వుండాలి.
* ఈ కాలంలో కోడిగ్రుడ్లు తరచూ చెడిపోతాయి. అలా పాడవకుండా వుండాలంటే గ్రుడ్లమధ్య వేప ఆకులు వుంచాలి.
* నెయ్యి సువాసన కోల్పోకుండా వుండాలంటే దానిలో చిన్న బెల్లం ముక్క వేస్తే ఘుమఘు పోదు.
* పచ్చిమిర్చి ఎర్రబడకుండా వుండాలంటే వాటిని గాలి చొరబడని సీసాలో వుంచి దానిలో కొద్దిగా పసుపు వేయాలి. ఈ సీసాను గాలి వ్యాపించే ప్రదేశంలో ఉంచాలి.
* కరివేపాకు, కొత్తిమీర పాడవకుండా స్టీలు డబ్బాలో వుంచి మూత గట్టిగా బిగించాలి.
* జున్ను కరిగిపోకుండా, ఎండిపోకుండా వుండాలంటే వెనిగర్‌లో తడిపిన ఒక సన్నని బట్టపై జున్నును వుంచాలి.
* కూరగాయలపై నిమ్మకాయ పిండిన నీటిని చిలకరించాలి.
* కాకరకాయ రెండు ముక్కలు చేసి నిలువ వుంచితే బాగుంటాయి. వేపుడుకు అనువుగా వుంటాయి. -

బి.విజయలక్ష్మి