ఐడియా

జిడ్డును తరిమేయండిలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవి కాలంలో చర్మం జిడ్డుగా మారుతుంది. చమట ఎక్కువగా పోయటంతో పాటు ఎండ వేడిమికి జిడ్డు కారుతుంది. ఇలాంటివారు రెండు కప్పుల ఓట్స్, ఒక కప్పు బాదాం, రెండు టీ స్పూన్‌ల ఎండిన తులసి ఆకులు, రెండు టీ స్పూన్‌ల ఎండిన పుదినా ఆకులు, రెండు కప్పుల ముల్తాని మట్టిని కలిపి పేస్టుగా చేసి ఒళ్లంతా రాసుకుని, గోరు వెచ్చని నీటితో స్నానం చేసుకుంటే జిడ్డుదనం పోయి చర్మం తేమగా ఉంటుంది.
పొడిబారిన చర్మం తేమగా అయ్యేందుకు ఒక స్పూన్ పాల క్రీం, ఒక స్పూన్ ముల్తాని మట్టి, అర స్పూన్ తేనె, కొంచెం నూనె వేసి పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్టును ఒళ్లంతా రాసుకుని 15 నిమిషాల తరువాత కడిగేస్తే పొడిచర్మం మృధువుగా, తేమగా ఉంటుంది.
స్నానానికి ముందు శరీరాన్ని శుభ్రం చేసుకునే బ్రష్‌తో ఒళ్లంతా ఒకసారి రుద్దితే వ్యాధి క్రిములు పుట్టించే విషపదార్థాలు తొలగి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
బాడీ ప్యాక్ కోసం పుదీనా ఆకులను, బాదంలను పేస్టులాగా చేసుకుని ఆ పేస్టును గోరువెచ్చని నీటిలో కలపాలి. ఆ పేస్టును ఒళ్లంతా రాసుకుని స్నానం చేస్తే చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది.
అరకప్పు ద్రాక్షాపండ్ల రసాన్ని ముల్తాని మట్టితో కలిపి పేస్టులా చేసుకుని రాసుకున్న తరువాత కడిగేస్తే ముఖం తాజాగా కనిపిస్తుంది.