బిజినెస్

ఐఐపి గణాంకాలు నిరాశాజనకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అసంతృప్తి

న్యూఢిల్లీ, మార్చి 12: పారిశ్రామికోత్పత్తి (ఐఐపి) గణాంకాలు నిరాశాజనకంగా ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని, అయితే ఈ క్రమంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతున్నాయన్నారు. శనివారం ఇక్కడ ఆర్‌బిఐ 551వ బోర్డు సమావేశం జరిగింది. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జనవరి నెలకుగానూ శుక్రవారం విడుదలైన ఐఐపి గణాంకాలు నిరాశపరిచాయన్నారు. ఇదిలావుంటే విజయ్ మాల్యా రుణాల ఎగవేత వ్యవహారం నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బకాయిల అంశం ఆందోళనకరంగా మారిందని, దీనివల్ల బ్యాంకింగ్ కార్యకలాపాల వృద్ధికి భంగం ఏర్పడే వీలుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. సమావేశంలో జైట్లీ మాట్లాడగా, మొండి బకాయిల అంశాన్ని మరీ ఎక్కువగా చేసి చూపవద్దన్నారు. ఇకపోతే కీలక వడ్డీరేట్లపై నిర్ణయానికి ప్రతిపాదిత ఆరుగురు సభ్యుల ద్రవ్యవిధాన కమిటీపట్ల రాజన్ ఆనందం వ్యక్తం చేశారు. నిర్మాణాత్మక సంస్కరణలు వృద్ధిరేటుకు దోహదపడతాయన్నారు.