ఇక్కడే సెటిలవుతా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోయిన్‌గా పరిచయమై పలు చిత్రాల్లో నటించినప్పటికీ పాపం కెరీర్ పరంగా ఒక్క కమర్షియల్ హిట్ దక్కలేదు. దాంతో గ్లామర్‌ను నమ్ముకొని అవకాశాలు కొట్టేసింది అందాల భామ శ్రద్ధాదాస్. ఇటీవలే ‘గుంటూర్ టాకీస్’లో రెచ్చిపోయి మరీ బోల్డ్‌గా నటించి, అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఈ భామకు మంచి పేరే దక్కింది. ఇప్పటికే తమిళ, హిందీ, కన్నడ భాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నా లాభం లేకపోయింది. ఆమధ్య కృష్ణవంశి దర్శకత్వంలో వచ్చిన ‘మొగుడు’ సినిమాలో టూపీస్ బికినీలో అందాలు ఆరబోసినా అంతంత మాత్రంగానే అవకాశాలు దక్కాయి. మొత్తానికి ఈమె జాతకాన్ని ‘గుంటూర్ టాకీస్’ మార్చేసినట్టే వుంది. ఇకపై తెలుగు చిత్రసీమలోనే సెటిలవ్వాలని నిర్ణయం తీసుకుందట. ఇప్పటికే ఇక్కడ అవకాశాలు క్యూకట్టడంతో హైదరాబాద్‌లో ఇల్లుకూడా తీసుకునేందుకు సన్నాహాలు మొదలుపెట్టిందట. ఏదేమైనా ఇన్నాళ్లకి సొంతింటిపై శ్రద్ధ పెరిగింది ఈ భామకు. (చిత్రం) శ్రద్ధాదాస్