Others

చిన్నపిల్లల ఫొటోలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో టాప్‌స్టార్‌గా వున్న ఇలియానా తన స్టార్‌డమ్‌నంతా ఉపయోగించి హిందీ సినిమాల్లో చేయడానికి వెళ్లిపోవడాన్ని ఇన్నాళ్లూ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. ఇప్పుడు ఇలియానా కూడా అదే బాధతో వుంది. హ్యాపీ హ్యాపీగా బాలీవుడ్‌లో సెటిల్ అవుదామని వెళితే రెండు మూడు మంచి ఆఫర్లు వచ్చాయి. అవి కూడా హిట్ అయ్యాయి. దీంతో ఇలియానా ఎక్కడకు వెళ్లినా బంగారమే అన్న నానుడి వచ్చింది. ఏమైందో ఏమో ఒక్కసారిగా ఆమె కెరీర్ హ్యాపీ ఎండింగ్‌లాగా మారిపోయింది. కెరీర్ ఎండ్ అవుతుందా ఏమిటీ అన్న భయంతో ఇన్నాళ్లూ నెట్టుకొచ్చింది. సినిమాలు లేవు కదా, ఏం చేస్తున్నారు అని అడిగితే ప్రస్తుతం తాను ఫొటోగ్రఫిలో ప్రయోగాలు చేస్తున్నానంటోంది. చిన్నపిల్లల ఫొటోలు తీయడం తనకు ఎంతో ఇష్టమైన హాబీ అని, ఆ హాబీని ఇప్పుడు పూర్తి స్థాయిలో ఉపయోగిస్తున్నానని అంటోంది. మొత్తానికి చేతిలో సినిమాలు లేకపోయేసరికి కెమెరా తీసుకుని తన పాత ముచ్చట్లన్నీ తీర్చుకుంటోందన్నమాట!