జాతీయ వార్తలు

నవాజ్‌షరీఫ్‌పై ఇమ్రాన్ మండిపాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై మండిపడ్డారు. ఆయన అమెరికా పర్యటనలో భాగంగా ఈరోజు ప్రవాస పాకిస్థానీయులను ఉద్దేశించి మాట్లాడారు. జైలు జీవితం గడుపుతున్న నవాజ్ షరీఫ్ జైలులో ఏసీ,టీవీ ప్రత్యేక గది వంటి సకల సదుపాయాలతో పాటు ఇంటి నుంచి భోజనం వస్తుందని అన్నారు. పాకిస్థాన్‌లో సగం మంది ఏసీ, టీవీలు లేకుండా గడుపుతున్నారని, అటువంటప్పుడు ఆయనకు వేసింది శిక్షేణా అని ప్రశ్నించారు. తాను పాకిస్థాన్ వెళ్లిన తరువాత అవన్నీ తొలగిస్తానని చెప్పారు. కాగా దీనిపై షరీఫ్ కుమార్తె రాద్దాంతం చేయవచ్చని, అయినప్పటికీ వాటిని తొలగిస్తామని, వారు లూటీ చేసిన సొమ్మును స్వాధీనం చేసుకున్నామని, ఇంకా విదేశాల్లో ఉందని, ఆయా దేశాల సాయంతో వాటిని వెనక్కి రప్పిస్తామని అన్నారు. అమెరికా పర్యటనకు వెళ్లిన ఇమ్రాన్‌ ఖాన్‌కు తొలుత ఘోర అవమానం ఎదురైంది. ఆయను ఆహ్వానించడానికి అమెరికా ప్రభుత్వ అధికారులెవరూ రాలేదు. పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ మంత్రి మహమ్మద్‌ ఖురేషీ, పెద్ద ఎత్తున అమెరికన్‌ పాకిస్థానీలు ఆయనను విమానాశ్రయంలో ఆహ్వానించారు. నేడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఆయన భేటీ కానున్నారు.