బిజినెస్

మేనేజ్‌మెంట్ విద్యకు చిరునామా ఐఎంటి హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొనియాడిన టివిఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్
హైదరాబాద్, మార్చి 14: బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్యావ్యాప్తిలో అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఐఎంటి) అగ్రగామిగా నిలుస్తోందని సుందరం క్లేటాన్ గ్రూప్ (టివిఎస్) చైర్మన్ వేణు శ్రీనివాసన్ ప్రశంసించారు. ఇక్కడ ఐఎంటి క్యాంపస్ స్నాతకోత్సవంలో 2015-16 బ్యాచ్ విద్యార్థులకు పట్టాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఎంటి హైదరాబాద్ క్యాంపస్ చక్కటి విద్యా ప్రమాణాలకు నిలయంగా ఉందని, క్యాంపస్ సెలక్షన్‌లలో విద్యార్థులకు మంచి ఉద్యోగాలు లభిస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా, ఐఎంటి డైరెక్టర్ సతీష్ ఐలవాడి మాట్లాడుతూ 2015-16 సంవత్సరం తమకు ఎంతగానో కలిసొచ్చిన సంవత్సరమన్నారు. ఈ ఏడాది సంస్థకు ఎబిపి న్యూస్ నుంచి నేషనల్ ఎడ్యుకేషన్ అవార్డు 2015 లభించిందని, ఆసియాలోనే ఉత్తమ బిజినెస్ స్కూల్‌గా, ఆరవ ఆసియా ఎడ్యుకేషన్ ఎక్స్‌లెన్స్ అవార్డు 2015 కూడా దక్కిందన్నారు.