జాతీయ వార్తలు

జెఎన్‌యుపై చర్చకు సిద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య, జెఎన్‌యు వర్శిటీ గొడవలపై చర్చ జరగాలన్న కాంగ్రెస్ సూచనకు ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. పార్లమెంటులో చర్చలు వాడిగా వేడిగా జరిగినా ఫరవాలేదుకానీ, స్థాయికి తగ్గిన విమర్శలు చేయకూడదని సూచించారు. మేం గొడవ చేస్తే చేస్తాంకానీ, పార్లమెంటు మాత్రం సజావుగా సాగాలన్న విపక్షాల విధానం ఎంతమాత్రం మంచిది కాదన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాలు సజావుగా జరిపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాను స్వయంగా కలిసి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశాను. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీల నాయకులతో చర్చించామని వెంకయ్య వివరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను తమ నివాసానికి ఆహ్వానించి చర్చలు జరిపారు, పార్లమెంటు ఆమోదించవలసిన వివిధ బిల్లుల గురించి మంతనాలు జరిపారని ఆయన తెలిపారు. పార్లమెంటు సజావుగా జరిగేందుకు అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు అంగీకరించాయనీ, రాష్ట్రాల సమస్యలపై చర్చ జరగాలని కూడా సూచించాయని వెంకయ్య చెప్పారు. గత యుపిఏ ప్రభుత్వం నియమ, నిబంధనల పేరుతో సభలో చర్చకు అడ్డుకునేదనీ, అయితే తమ ప్రభుత్వం మాత్రం అన్ని అంశాలపై చర్చ జరగాలని కోరుకుంటోందన్నారు. ‘జెఎన్‌యు గొడవలపై చర్చ జరగాలని బిజెపి కూడా కోరుకుంటోంది. ఇది దేశ సమగ్రతకు సంబంధించిన అంశం. కొందరు వ్యక్తులు, పార్టీలు కల్లోలం సృష్టించటం ద్వారా ప్రభుత్వంపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయ’ని వెంకయ్య ఆరోపించారు. కమ్యూనిస్టు భావాలు ఉన్నవారు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్లుగా నియమితులు కావచ్చు కానీ జాతీయ భావాలు ఉన్నవారు వీసీలుగా నియమితులు కాకూడదా అని ఆయన ప్రశ్నించారు. ఇందిరా గాంధీతో గతంలో కుదిరిన ఒప్పందం మేరకు కాంగ్రెస్ అధికారాన్ని అనుభవిస్తే, విశ్వవిద్యాలయాల్లో కీలక పదవులను కమ్యూనిస్టులు తీసుకున్నారని ఆయన చెప్పారు. ఇప్పుడు వీరి పదవీ కాలం ముగిసిన అనంతరం జాతీయ భావాలున్న వారు వి.సిలుగా నియమితులవుతున్నారు కాబట్టే వీరికి సమస్యలు ఎదురవుతున్నాయని వెంకయ్య తెలిపారు. జెఎన్‌యులో జరిగిన సమావేశంలో ఒక కులాన్ని విమర్శించటం, అఫ్జల్ గురును అన్యాయంగా ఉరి తీశారని బ్యానర్లు ప్రదర్శించటం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. పార్లమెంటుపై దాడి చేసినందుకు శిక్షించిన వారిని ప్రతిపక్షాలు సమర్థించటం ఏమిటి అని ఆయన నిలదీశారు. పార్లమెంటును ధ్వంసం చేయాలనే వారికి ప్రతిపక్షం మద్దతు ఇవ్వటం దేశ వ్యతిరేక చర్య కాదా? అని ప్రశ్నించారు. కాశ్మీర్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలని డిమాండ్ చేసేవారు, నినాదాలు ఇచ్చే వారిని ప్రతిపక్షాలు సమర్థించటం అన్యాయం కాదా? అని వెంకయ్య నిలదీశారు. కాశ్మీర్ దేశంలో అంతర్భాగం, దానిని ప్రశ్నించే వారిని ప్రశ్నిస్తాం అని ఆయన స్పష్టం చేశారు. అఫ్జల్ గురు, మక్బూల్ భట్, యాకూబ్ మెమన్ వంటి దేశద్రోహులకు సానుభూతి చూపించటం ఏమిటి? ఈ అంశంపై ప్రభుత్వాన్ని విమర్శించటం ఏమిటి? అని వెంకయ్య ప్రశ్నించారు. కొందరు వ్యక్తులు పనికట్టుకుని ఇదంతా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జెఎన్‌యులో జరిగిన సంతాప సభలో ఇచ్చిన దేశ ద్రోహ, దేశ వ్యతిరేక నినాదాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ కుమార్ ప్రకటిస్తే సమస్య పరిష్కారం అవుతుందని వెంకయ్య తెలిపారు. పార్లమెంటులో ఈ అంశంపై చర్చ జరిగినప్పుడు ఇందుకు సంబంధించిన అన్ని విషయాలను ప్రభుత్వం బయటపెడుతుందని ఆయన చెప్పారు.

చిత్రం... కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం వెలుపలకు వస్తున్న వెంకయ్య నాయుడు. చిత్రంలో మంత్రులు డి.వి. సదానంద గౌడ, అనంత కుమార్

సామాజిక
కార్యక్రమాల్లో
పాల్గొనండి
పోలీసులకు ప్రధాని పిలుపు
ఖరారవుతున్న కార్యాచరణ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: పల్స్‌పోలియో వంటి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పోలీసు ఉద్యోగులను పిలుపునిచ్చారు. సోషల్ మీడియా, అన్ని మహిళా సంఘాల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అన్ని డిజిపిలు, ఇన్స్‌స్పెక్టర్ జనరల్స్ సమావేశంలో ప్రధాని మార్గనిర్దేశం చేశారు. దీనికి సంబంధించి ఆయా శాఖల ఉన్నతాధికారులు ఓ కార్యాచరణ రూపొందించినట్టు ఓ అధికార ప్రకటనలో తెలిపారు. కేంద్ర సాయుధ దళాలు, పోలీసు శాఖల నుంచి డజను కమిటీలను ఏర్పాటు చేసి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బ్లూప్రింట్ తయారు చేశారు. కమిటీలు ఇచ్చే సూచనలు, సలహాలు ఈ ఏడాది జూన్, జూలై నుంచి అమల్లోకి రానున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. సమాజంతో పెరిగిపోతున్న దూరాన్ని తగ్గించుకోవాలన్న లక్ష్యంతో పల్స్‌పోలియో వంటి సామాజిక కార్యక్రమాల్లో పోలీసులు పాల్గొనేలా చేయాలని నిర్ణయించారు. అంతేకాదు బడిఈడు పిల్లలను పాఠశాలలకు వెళ్లేలా ప్రోత్సహించడం, ప్రతిభగల కళాశాల, పాఠశాల విద్యార్థులకు ప్రోత్సహకాలు ఇవ్వడం వంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలోనే ఈ కార్యక్రమాలు ఉంటాయి. అక్టోబర్ 31న పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా యువతకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని ప్రధాని మోదీ ఉద్బోధించారు. సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములవుతూ ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.

గిలానీ కేసులో త్వరలో
మరికొంతమంది అరెస్టు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: దేశద్రోహం, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలతో అరెస్టయిన ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఎస్‌ఎఆర్ గిలానీ కేసుకు సంబంధించి త్వరలో మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసులు బుధవారం వెల్లడించారు. గిలానీ కేసులో పాలుపంచుకున్న కొంతమందిని విచారణ జరుపుతున్నామని, కీలకంగా వ్యవహరించినవారిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి.ఎస్.బస్సి విలేఖరులకు తెలిపారు. ఈ నెల 10న ఇక్కడి ప్రెస్‌క్లబ్‌లో జరిగిన చట్టవ్యతిరేక కార్యక్రమంలో భారత్ వ్యతిరేక నినాదాలు చేయడం, ఈ కార్యక్రమానికి కన్వీనర్‌గా జిలానీ వ్యవహరించిన విషయం విదితమే. 12వ తేదీన గిలానీపై ఎఫ్‌ఐఆర్ నమోదు కావడం, అదేరోజున యూనివర్శిటీ క్యాంపస్‌లో అఫ్జల్ గురు ఉరితీతను వ్యతిరేకిస్తూ జరిగిన కార్యక్రమానికి సంబంధించి జెఎన్‌యు స్టూడెంట్స్ యూనియన్ నాయకుడు కన్హయ కుమార్‌ను మరో కేసులో అరెస్టు చేశారు. ఈ ఘటనలకు సంబంధించి నాలుగు రోజుల వ్యవధిలో ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్లు అలీ జావెద్, నిర్మలాంగ్షు ముఖర్జీ, త్రిప్తా వాహిలను పోలీసులు ప్రశ్నించారు. ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో గిలానీతోసహా ఈ ముగ్గురు ప్రొఫెసర్లు వేదికపై ఉన్నారు. ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాన నిర్వాహకుడు గిలానీనేనని, కార్యక్రమ నిర్వహణకోసం ప్రెస్‌క్లబ్‌కు ఇ-మెయిల్ పంపింది కూడా అతనేనని పోలీసులు వెల్లడించారు.
దేశంలో కొత్తగా ఆరు రైల్వే లైన్లు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: దాదాపు 10,700 కోట్ల వ్యయంగా కొత్తగా ఆరు రైల్వే లైన్లు, ఓ రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పెరుగుతున్న ప్రయాణ, రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 908కి.మీ పొడవున ఈ రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతుందని, ఇందుకు సంబంధించి బడ్జెటేతర వనరుల నుంచి నిధులను కేటాయించడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.