క్రీడాభూమి

ఇండోనేషియా ఓపెన్ నుంచి సైనా నిష్క్రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, జూన్ 3: త్వరలో ఒలింపిక్ క్రీడలకు వెళ్లబోతున్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో చుక్కెదురైంది. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ పోరులో ఆమె స్పెయిన్‌కు చెందిన ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొని ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకోవడంతో పాటు గతంలో మూడుసార్లు ఇండోనేషియా సూపర్ సిరీస్ టైటిళ్లను కైవసం చేసుకున్న సైనా నెహ్వాల్ 47 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో కరోలినా డిఫెన్స్‌ను చేధించడంలో విఫలమైంది. ఫలితంగా సైనాకు 22-24, 11-21 గేముల తేడాతో ఓటమి తప్పలేదు. ఈ టోర్నీలో ఎనిమిదో సీడ్ క్రీడాకారిణిగా బరిలోకి దిగిన సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ తొలి గేమ్‌లో ఒకానొక దశలో 7-13 తేడాతో వెనుకబడింది. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో పోరాడిన సైనా 16-14 తేడాతో ఆ తర్వాత 19-16 తేడాతో ఆధిక్యత సాధించి అభిమానుల్లో ఆశలు చిగురింప జేసింది. అయితే ఆ తర్వాత పుంజుకున్న కరోలినా 22-24 తేడాతో తొలి గేమ్‌ను కైవసం చేసుకోవడంతో పాటు రెండో గేమ్‌లో మరింత పవర్‌ఫుల్ షాట్లతో విజృంభించింది. ఫలితంగా 11-21 తేడాతో వరుసగా ఆ గేమ్‌ను కూడా కోల్పోయిన సైనాకు ద్వారాలు మూసుకుపోవడంతో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు.