రాష్ట్రీయం

ఓటర్లను ప్రలోభపరచినా ప్రజలు కాంగ్రెస్ వెంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనగాల

ఆత్మకూరు, నవంబర్ 21: అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడి ఓటర్లకు డబ్బులు పంచి ప్రలోభ పెట్టిన ప్రజలు కాంగ్రెస్‌కే ఓట్లు వేశారని కాంగ్రెస్ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి పేర్కొన్నారు. వరంగల్ జిల్లా ఆత్మకూరులో ఎన్నికల అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామా ల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఎన్నికల కోసం వంద కోట్ల పనులను మంజూరు చేస్తామని, టిఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని సెటిల్‌మెంట్ చేశారన్నారు. కేవలం పరకాల నియోజకవర్గానికి 25కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తామని ప్రజలను మభ్యపెట్టారని ఆయన ఆరోపించారు. నిజామాబాద్ ఎంపి కవిత వరికోల్ గ్రామానికి వెళ్లి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా బతుకమ్మ ఉత్సవాలకు 10కోట్లు ఇస్తానని చెప్పడం జరిగిందని, మా వద్ద టిఆర్‌ఎస్ పార్టీ నేతల అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఆధారాలు ఉన్నాయని, ఎన్నికల అనంతరం వాటిపైన లోకాయుక్తలో ఫిర్యా దు చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ తెచ్చే విధంగా టిఆర్‌ఎస్ నాయకులు ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడిచి అధికార దుర్వినియోగంకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వ అవినీతిని ఎండగట్టి గాంధేయ మార్గంలో కాంగ్రెస్‌కు ఓట్లు వేయించారని ఆయన చెప్పారు. రానున్న మూడు నెలల్లో పరకాల శాసనసభకు ఉప ఎన్నికలు వస్తాయని, అందులో కాంగ్రెస్ సత్తా ఏంటో చూపుతుందని ఆయన అన్నారు. అనంతరం కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ లేతాకుల సంజీవరెడ్డి మాట్లాడు తూ ఉప ఎన్నికలో అధికారులు, పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాశారని ఆరోపించారు. ఆత్మకూరు పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఓటర్లను ప్రలోభపెట్టినా పట్టించుకోకపోగా ఇదేమిటని అడిగిన తమపైన అసభ్య పదజాలంతో దూషించారని, ఇది సరైంది కాదని ఆయన అన్నారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడంపైన ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సామేల్, ఎంపిటిసిలు పర్వతగిరి మహేశ్వరి రాజు, కోరె రమేష్ తదితరులు పాల్గొన్నారు.