రాష్ట్రీయం

పొంతన కుదరని ఆదాయ వ్యయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లెక్కకు మించిన అప్పులు, వడ్డీలు
రాజధానికి అరకొర నిధులు
స్వయం సహాయక బృందాలకు మొండిచెయ్యి

హైదరాబాద్, మార్చి 10: కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులతో కలుపుకొని 1.9 లక్షల కోట్ల ఆదాయం చూపించిన రాష్ట్రప్రభుత్వం 1.35 లక్షల కోట్ల వ్యయంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో ఆదాయానికి , వ్యయానికి పొంతన కుదరడం లేదని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం ఆదాయంలో రాష్ట్ర ఆదాయం 52,318 కోట్లు కాగా, కేంద్రం నుండి పన్నుల రూపంలో వస్తాయని భావిస్తున్న ఆదాయం 24,637 కోట్ల వరకూ ఉంది. గత ఏడాది పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం 49,764 కోట్లు మాత్రమే. అంటే ఈసారి పన్నుల ఆదాయం మరో 8వేల కోట్ల మేర పెరగాల్సి ఉంది, గ్రాంట్ ఇన్ ఎయిడ్ 26,849 కోట్ల వరకూ ఉంది. రాష్ట్ర ఆదాయంలోనూ నూటికి నూరు శాతం వసూలైతేనే అదీ 50వేల కోట్ల మేర మాత్రమే ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేంద్రం గత ఏడాది ఇస్తామన్న నిధులనే ఇంకా పూర్తిగా విడుదల చేయలేదు. మరో పక్క రైతు రుణ మాఫీ, రాజధాని నిర్మాణం, కొత్త పథకాలు, కొత్త విద్యా సంస్థలు, మహిళా స్వయం సహాయక బృందాల రుణమాఫీతో పాటు పెన్షన్లు, పెరిగే జీతభత్యాలు, అప్పులు, వాటి వడ్డీలు ఉండనే ఉన్నాయి. రాష్ట్ర పునర్విభజనకు ముందు 10,417.49 కోట్లు రెవిన్యూ లోటు ఉండగా, 11,001.81 కోట్లు ఆర్ధిక లోటు కనిపించింది. శేషాంధ్రప్రదేశ్ మొదటి 10 నెలల కాలానికి 16,200 కోట్లు రెవిన్యూ లోటు ఉండగా, మార్చి 31, 2015 నాటికి రెవిన్యూ లోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 2.61 శాతం ఉంది. ఇన్నింటి మధ్య రాష్ట్రప్రభుత్వం తన లక్ష్యాన్ని ఎంత వరకూ నెరవేర్చుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం 1500 కోట్లు బడ్జెట్‌లో కేటాయించినా, అందులో వెయ్యి కోట్లు కేంద్రం ఇస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అంటే పరోక్షంగా రాష్ట్రం ఇవ్వదల్చుకున్న నిధులు 500 కోట్లు మాత్రమేననేది నిస్సందేహం. అలాగే రాష్ట్రంలో నిరుద్యోగులకు 2వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ మేరకు వారి ఆశలను నెరవేరుస్తుందనే నమ్మకం కేటాయించిన నిధులతో కలగడం లేదనేది నిపుణుల అభిప్రాయం. అమ్మకపు పన్ను నుండి 37,435 కోట్లు, ఎక్సైజ్ నుండి 5756 కోట్లు, ఎంవి టాక్స్ నుండి 2412 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది 1.13 లక్షల కోట్లు మేర వ్యయంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా అందులో 99.26 శాతం మాత్రమే ఖర్చు చేశారు. సవరించిన ప్రతిపాదనలు 1.12 లక్షల కోట్లు మాత్రమే. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ప్రణాళికా వ్యయం అంచనాల కన్నా 12.38 శాతం పెరిగింది. గత ఏడాది 34,412 కోట్లు ప్రణాళికా వ్యయంగా చూపించగా, అది 38,671కోట్లకు పెరిగింది.
గత రెండేళ్లుగా నాలుగు రాయలసీమ జిల్లాలు, మూడు ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి రాష్ట్రానికి ఏడాదికి 50 కోట్లు చొప్పున మాత్రమే సహాయం లభించింది. అలాగే 2015-16లో అమరావతి నిర్మాణానికి 850 కోట్లు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మరో 345 కోట్లు సహాయం లభించింది. ఇంకా అనేక అకౌంట్ల నుండి రాష్ట్రానికి రావల్సిన నిధులు పెండింగ్‌లోనే ఉన్నాయి. సెంట్రల్ సేల్స్ టాక్స్ నుండి 3500 కోట్లు, తక్కిన జిల్లాలతో పోలిస్తే వెనుకబడి ఉన్న ఏడు జిల్లాల అభివృద్ధికి 350 కోట్లు, అమరావతి నిర్మాణానికి వెయ్యి కోట్లు కేంద్రం విడుదల చేస్తుందనే ఆశతో ప్రభుత్వం ఉంది. అంటే దాదాపు 5వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఇంతవరకూ ఎలాంటి హామీ కేంద్రం నుండి దక్కలేదు. ఈ క్రమంలోనే రాష్ట్రప్రభుత్వం ఆర్ధిక నిర్వహణకు సంబంధించి అనేక సంస్కరణలను కూడా తీసుకువచ్చింది. త్రైమాసికంగా నిధులను విడుదల చేసే వ్యవస్థ స్థానంలో సమగ్ర బడ్జెట్ విడుదల ఉత్తర్వులను ప్రవేశపెట్టింది.