ఆటాపోటీ

‘బరువు’తో చెలగాటం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిట్నెస్ శిక్షణ నేడు ఒక పరిశ్రమగా మారింది. ఈ వర్గాలు వెయిట్‌లిఫ్టింగ్‌ను ఒక క్రీడగా అంగీకరించడం లేదు. బాడీబిల్డింగ్‌లో భాగంగానే వెయిట్‌లిఫ్టింగ్‌ను పరిగణిస్తున్నాయి. కొద్దిపాటి మార్పులు, ప్రత్యేక విభాగాలను పక్కకుపెడితే, వెయిట్‌లిఫ్టింగ్ సాధారణ ఫిట్నెస్ కోసం చేసే రొటీన్‌లో భాగమని ఈ వర్గాల వాదన. దీనికి ఒక క్రీడ అన్న ముద్రవేస్తే, ఫిట్నెస్ సెంటర్లలో వెయిట్‌లిఫ్టింగ్ అంశాన్ని తొలగించాల్సిన ప్రమాదం ఉంటుందని వారి ఆవేదన. అయితే, రొటీన్ ఫిట్నెస్‌లో లేదా బాడీ బిల్డింగ్ కోసం చేసే వెయిట్‌లిఫ్టింగ్‌కు, అంతర్జాతీయ స్థాయిలో జరిగే లిఫ్టింగ్‌కు చాలా తేడా ఉంటుందని నిపుణుల అభిప్రాయం.
================
చాలా తేలిగ్గా కనిపించే ‘బరువైన’ క్రీడ వెయిట్‌లిఫ్టింగ్. సమానమైన బరువును అటూఇటూ ఉంచి, మధ్యలో రాడ్‌ను పట్టుకొని ఎత్తడం ఏమంత కష్టం? అని ఎవరైనా ప్రశ్నిస్తే, అది వారి అమాయకత్వానికి చిహ్నం. అత్యంత ప్రమాదకమైన క్రీడల్లో వెయిట్‌లిఫ్టింగ్ ఒకటి. సరైన శిక్షణ లేకుండా లిఫ్టింగ్‌కు ప్రయత్నిస్తే గాయపడక తప్పదు. ఒక్కోసారి కండరాలు చిట్లిపోతాయి. శాశ్వత వైకల్యం పొందే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. హూస్టన్‌లో జరుగుతున్న ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో పోటీపడుతున్న లిఫ్టర్లు ఎన్నో అడ్డంకులను అధిగమించి, గండాలను తప్పించుకొని అర్హత సంపాదించిన వారే. నిరంతర కృషి, పట్టుదల వారిని ఆ స్థాయికి చేర్చాయి. జయాపజయాలు ఎలావున్నా, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనడానికి క్వాలిఫై కావడమే వారి సామర్థ్యానికి ప్రతీక. రోజూ గంటల తరబడి ప్రాక్టీస్ చేయాలి. చెమటతో ఒళ్లు తడిస్తేగానీ లిఫ్టింగ్‌లో రాటు తేలరు. ఒక స్థాయి దాటి తర్వాత, అదనంగా జత చేసే ప్రతి వంద గ్రాముల బరువు కూడా మోయలేనంత భారంగా మారుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవడానికి లిఫ్టర్లు సగటున రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు శ్రమిస్తారంటే ఆశ్చర్యం కలగక మానదు. తల కంటే ఎత్తుకు బరువులు మోయాలంటే ముందు కాళ్లు బలంగా, స్థిరంగా ఉండాలి. మోకాళ్లు, భుజాలు గాయపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బరువులు ఎత్తే సమయంలో తగిలే గాయాలు తీవ్రంగా ఉంటాయి. చాలా సమయాల్లో శస్తచ్రికిత్స అనివార్యమవుతుంది. చాలా సందర్భాల్లో లిఫ్టర్లు శాశ్వత వికలాంగులుగా మారిపోతారు. అందుకే, మిగతా క్రీడలతో పోలిస్తే వెయిట్‌లిఫ్టింగ్‌ను ప్రమాదకమైనదిగా పేర్కొంటారు. జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్యలు తప్పవు
ఘన చరిత్ర
వెయిట్‌లిఫ్టింగ్‌కు ఘన చరిత్రే ఉంది. ఆధునిక రూపాన్ని సంతరించుకోని కాలంలోనూ లిఫ్టింగ్ పోటీలు జరిగేవి. అయితే, అప్పట్లో బండరాళ్లను, పెద్దపెద్ద మొద్దులను ఎత్తడం పోటీలు ఉండేవి. భారత్, ఈజిప్టు, టర్కీ, జపాన్ వంటి దేశాల్లో మల్లయుద్ధంలో భాగంగా ఉండేది. తర్వాతి కాలంలో ప్రత్యేక క్రీడగా రూపు దిద్దుకుంది. 1900 సంవత్సరం నాటికి ఆధునికతను సంతరించుకొని అంతర్జాతీయ క్రీడగా ఎదిగింది. స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్‌తోపాటు మొత్తం బరువులోనూ పతకాలను అందించడం ఆనవాయితీగా వస్తోంది. స్నాచ్‌లో మొదట మోకాళ్లపై నిలబడి బరువును మోస్తూ, ఒక్కసారిగా పైకి ఎత్తుతారు. క్లీన్ అండ్ జెర్క్‌లో బరువును భుజాలకు సమారంతరంగా నిలబెట్టి కొంత సేపు ఆగుతారు. ఆతర్వాత పైకి ఎత్తుతారు. చేతులను పూర్తిగా పైకెత్తిన తర్వాత కొన్ని క్షణాలు బ్యాలెన్స్ చేసిన తర్వాతే బార్‌ను వదలాలి.
మహిళలను మొదట్లో వెయిట్‌లిఫ్టింగ్‌లోకి అనుమతించలేదు. 1987లో తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో మహిళలకు ప్రవేశం లభించింది. 2000లో తొలిసారి ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టారు. కఠోరమైన శారీరక శ్రమతో కూడుకున్నది కాబట్టి మహిళలకు ఇది సరిపోదన్న అభిప్రాయం ఇప్పటికీ చాలా మందిలో ఉంది. ఇటీవల కాలంలో మహిళా వెయిట్‌లిఫ్టర్లు ఎక్కువ సంఖ్యలో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటున్నారు. పురుషులతో సమానంగా రాణిస్తున్నారు.
ఎన్నో లాభాలు..
వెయిట్‌లిఫ్టింగ్‌ను ఒక క్రీడాగా తీసుకొని, కేవలం దాని కోసమే సంసిద్ధం కావాలన్న నియమం ఏదీ లేదు. దీనిని ఫిట్నెస్ కోసం చేసే వ్యాయామంలో ఒక భాగంగా చేసుకోవచ్చు. క్రీడగా అంతర్జాతీయ వేదికలపై పోటీలకు వెళ్లినా, జిమ్‌లో వ్యాయామంగా కొనసాగించినా లాభాలు సమానంగానే ఉంటాయి. స్థూలకాయాన్ని నివారించడంలో లిఫ్టింగ్‌ను మించిన వ్యాయామం లేదు. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న కండరాలను మరింత బలోపేతం చేస్తుంది. క్రీడల్లో రాణించడానికి ఈ కండరాలే తోడ్పడతాయి.
సాధారణంగా సైకిల్ తొక్కేవారికి, సైక్లింగ్‌ను ఒక క్రీడగా తీసుకున్న వారికీ చాలా వ్యత్యాసం ఉంటుంది. క్రీడల కోసం సైక్లిస్టులు ఒక ప్రత్యేక విధానంలో ప్రాక్టీస్ చేస్తారు. అందుకే వారి కండరాలు చాలా దృఢంగానూ, క్రీడలకు ఉపయోగపడే విధంగానూ రూపుదిద్దుకుంటాయి. వెయిట్‌లిఫ్టింగ్‌లోనూ ఈతేడా కనిపిస్తుంది. వివిధ వృత్తుల్లో భాగంగా బరువులు మోసేవారికి, వెయిట్‌లిఫ్టర్లకు శరీరాకృతిలోనేకాదు, బలమైన కండరాల విషయంలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. అథ్లెట్ల శక్తిసామర్థ్యాలను పెంచే విధంగా వెయిట్‌లిఫ్టింగ్ కండరాలను సమన్వయపరుస్తుంది. కండరాల్లోని మోటార్ యూనిట్ల పనితీరును మెరుగుపరుస్తుంది. మనిషిలో చురుకుదనాన్ని పెంచుతుంది. తీవ్రమైన ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. వెయట్ లిఫ్టింగ్‌ను ఒక క్రీడగానేగాక, ఫిట్నెస్ ప్రాక్టీస్‌లో ఒక అంశంగా కూడా స్వీక రించవచ్చన్న వాదనలో నిజం లేకపోలేదు. అయతే, ఇది చాలా ఖర్చుతో కూ డుకున్న ప్రక్రియ. మంచి ఆహారం ఉండాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వసతులు అందుబాటులో ఉండాలి. నిపుణుల పర్యవేక్షణలో ప్రాక్టీస్ కొనసాగాలి. క్రికెట్, టెన్నిస్, బాడ్మింటన్ వంటి కొన్ని క్రీడలకు మాత్రమే ప్ర చారం, ప్రోత్సాహం లభిస్తున్నాయ. మిగతా క్రీడలు ఆదరణకు నోచుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో వెయట్ లిఫ్టింగ్‌ను ప్రొఫెషన్‌గా ఎంచుకోవడానికి ఎం తో ఆత్మవిశ్వాసం కావాలి. కరణం మల్లీశ్వరి వంటి ఒలింపిక్ పతక విజేత తెలుగు తేజం కావడం అందరికీ గర్వకారణమే. కానీ, అదే స్థాయ లిఫ్టర్లు రా వడం లేదనుకునే ముందు, ప్రభుత్వ పరంగా లభిస్తున్న ప్రోత్సాహం ఏ మా త్రం ఉందో చూడాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, అన్ని క్రీడలకు సమ న్యాయం జరిగేలా చూస్తే తప్ప వెయట్‌లిఫ్టింగ్ వంటి క్రీడలు అభివృద్ధి చెందవు. ఎన్నో వ్యయ ప్రయాలకు ఓర్చి భారత లిఫ్టర్లు అంతర్జాతీ య వేది కలపై పోటీ పడుతున్నారు. వారికి గుర్తింపు, ప్రోత్సాహం లభించా ల్సిన అవసరం ఉంది. మాజీ మల్లయుద్ధ వీరులు, లిఫ్టర్లు, ఇతర క్రీడాకారులు కెరీర్‌ను కొనసాగించినంత కాలం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. కెరీ ర్ ముగించిన చాలామంది రోజు కూలీలుగానో, రిక్షా కార్మికులుగానో మారి పోతున్నారు. నిర్లక్ష్యమన్న గ్రహణం పట్టిన మన దేశం వెయట్‌లిఫ్టింగ్‌లో అసాధారణ ప్రమాణాలను, అందు కుంటుందని అద్భుతంగా రాణించి, పతకాలు సాధిస్తుందని అనుకోవడం అత్యాశే.
ఫిట్నెస్ కీలకం
క్రీడల్లో ఫిట్నెస్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో దీని ప్రాధాన్యం రెట్టింపు అవుతుంది. ఫిట్నెస్ కోసం వ్యాయామం తప్పనిసరి. ఆతర్వాత బరువును ఎత్తే ప్రాక్టీస్ చేయాలి. జిమ్‌లో గంటలకు గంటల సమయాన్ని వెచ్చించాలి. కిందకు వంగి బరువును పైకి ఎత్తే సమయంలో ఒక్కోసారి వెన్ను భాగంలో కండరాలు పట్టుకుంటాయి. చాలా సందర్భాల్లో కండరాలు చిట్లిపోతాయి. హామ్‌స్ట్రింగ్‌గా పేర్కొనే ఈ సమస్య కారణంగా చాలా మంది కెరీర్‌కు దూరం కావాల్సి వచ్చింది. వెన్నునొప్పితో ఒకటిరెండు నెలలు దూరమైతే మళ్లీ వెయిట్‌లిఫ్టింగ్ చేయడానికి ముందు కనీసం ఐదారు నెలలు జిమ్‌లో కష్టపడాలి. ఫిట్నెస్ సమస్యలు తరచు వేధించే క్రీడల్లో వెయిట్‌లిఫ్టింగ్ కూడా ఒకటి.
బలవర్ధక ఆహారం..
క్రీడాకారులు తప్పనిసరిగా బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలి. అయితే, మిగతా వారితో పోలిస్తే రెజ్లర్ల మాదిరిగానే వెయిట్‌లిఫ్టర్లు కూడా ఎక్కువ ఆహారం తీసుకోవాలి. ప్రతినెలా వేలాది రూపాయలు వారు తిండి మీదే ఖర్చు చేస్తారు. అపారమైన శక్తి కావాలంటే, అందుకు దీటైన ఆహారం తప్పనిసరి. ఎక్కువ క్యాలరీస్ ఇచ్చే అత్యంత నాణ్యమైన ఆహారాన్ని తీసుకోకపోతే లిఫ్టర్లుగా రాణించలేరు. చాలా మంది కొవ్వుకు, కండరాలకు తేడా తెలియక రెండూ ఒకటేనని అనుకుంటారు. కానీ, కండరాలు కొవ్వుగా మారడం లేదా విశేషమైన పరిశ్రమ వల్ల కొవ్వు కండరాలుగా రూపాంతరం చెందడం అసాధ్యం. బాడీ బిల్డర్‌కు లేదా రెజ్లర్‌కు వెయిట్‌లిఫ్టింగ్‌తో పనిలేకపోవచ్చు. కానీ, లిఫ్టర్ మాత్రం బాడీ బిల్డర్, రెజ్లర్ తరహా శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి.
============
ప్రపంచ రికార్డులు
పురుషుల వెయిట్‌లిఫ్టింగ్
56 కిలోల విభాగం: స్నాచ్‌లో 138 కిలోల బరువునెత్తిన టర్కీ లిఫ్టర్ హలీల్ ముత్లు ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. అతను మొత్తం 305 కిలోల బరువును ఎత్తి మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. క్లీన్ అండ్ జర్క్‌లో ఓం యున్ చోయ్ (దక్షిణ కొరియా) 170 కిలోలతో ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు.
62 కిలోల విభాగం: స్నాచ్‌లో 154, మొత్తం 332 కిలోలతో దక్షిణ కొరియా లిఫ్టర్ కిమ్ అన్ గక్ రికార్డులును నమోదు చేయగా, క్లీన్ అండ్ జెర్క్ రికార్డు 182 కిలోల బరువునెత్తి చైనా లిఫ్టర్ లీ మావోషెంగ్ సొంతం చేసుకున్నాడు.
69 కిలోల విభాగం: చైనా లిఫ్టర్ లియావో హుయ్ స్నాచ్ (166 కిలోలు), క్లీన్ అండర్ జర్క్ (198 కిలోలు), మొత్తం (359 కిలోలు) ఈవెంట్స్‌లో ప్రపంచ రికార్డులను క్లీన్‌స్వీప్ చేశాడు.
77 కిలోల విభాగం: స్నాచ్‌లో 176, మొత్తం 380 కిలోల బరువునెత్తిన చైనా లిఫ్టర్ లూ జియావోజున్ రికార్డులు నెలకొల్పగా, క్లీన్ అండ్ జెర్క్‌లో ఒగెల్ పెరెపెచెనొవ్ (రష్యా) 210 కిలోలతో రికార్డు సృష్టించాడు.
85 కిలోల విభాగం: బల్గేరియాకు చెందిన ఆండ్రెయ్ రిబకో స్నాచ్‌లో 187 కిలోలు, మొత్తం 394 కిలోలు బరువునెత్తి రికార్డులు నెలకొల్పాడు. క్లీన్ అండ్ జెర్క్ ఈవెంట్‌లో యాంగ్ జాంగ్ (చైనా) 218 కిలోలతో రికార్డు పుటల్లో చోటు దక్కించుకున్నాడు.
94 కిలోల విభాగం: స్నాచ్‌లో అకకియోస్ 188 పరుగులతో రికార్డు నెలకొల్పగా, క్లీన్ అండ్ జెర్క్ (233 కిలోలు)తోపాటు మొత్తం (418 కిలోలు) లిఫ్ట్‌లలో లియా ఇలిన్ (కజకస్థాన్) రికార్డులు సృష్టించాడు.
105 కిలోల విభాగం: బల్గేరియా లిఫ్టర్ ఆండ్రెయ్ అరాంనవూ పేరిట స్నాచ్ (200 కిలోలు), మొత్తం (436 కిలోలు) రికార్డులు ఉండగా, క్లీన్ అండ్ జెర్క్‌లో రికార్డును లియా ఇలిన్ (242 కిలోలు) దక్కించుకున్నాడు.
ప్లస్ 105 కిలోల విభాగం: స్నాచ్‌లో ఐర్లాండ్ లిఫ్టర్ బెదాద్ సలిమికొర్డాసియాబి 214 కిలోల బరువునెత్తి రికార్డు నెలకొల్పాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో 263, మొత్తం 472 కిలోలతో అదే దేశానికి చెందిన హోసేన్ రెజా జాదే రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
మహిళల వెయిట్‌లిఫ్టింగ్
48 కిలోల విభాగం: స్నాచ్‌లో 98, మొత్తం 217 కిలోలతో లియాన్ యాంగ్ (చైనా) రికార్డులు సృష్టించగా, క్లీన్ అండ్ జెర్క్‌లో 121 కిలోలతో టర్కీ లిఫ్టర్ నుర్కాన్ టైలాన్ రికార్డు నెలకొల్పింది.
53 కిలోల విభాగం: స్నాచ్‌లో పింగ్ లీగ (చైనా/ 103 కిలోలు), క్లీన్ అండ్ జెర్క్‌లో జుల్ఫియా చిన్‌షాన్లో (కజకస్థాన్/ 233 కిలోలు), మొత్తంలో షు చింగ్ సూ (చైనీస్ తైపీ/ 251 కిలోలు) రికార్డులు స్థాపించారు.
63 కిలోల విభాగం: స్నాచ్‌లో రష్యాకు చెందిన స్వెత్లానా సరుకెవా 117 కిలోల బరువునెత్తి రికార్డు సృష్టించింది. క్లీన్ అండ్ జెర్క్ (145 కిలోలు), మొత్తం (261 కిలోలు) ఈవెంట్స్ రికార్డులను జు చి లిన్ (చైనీస్ తైపీ) తన పేరిట నమోదు చేసుకుంది.
69 కిలోల విభాగం: చైనా లిఫ్టర్ చున్‌హోగ్ లియూ స్నాచ్‌లో 128, క్లీన్ అండ్ జెర్క్‌లో 158, మొత్తం 286 కిలోల బరువునెత్తడం ద్వారా మూడు ఈవెంట్స్‌లోనూ రికార్డులను హస్తగతం చేసుకుంది.
75 కిలోల విభాగం: రష్యాకు చెందిన నతాలియా జబొలొనయా స్నాచ్‌లో 135, మొత్తం 296 కిలోల బరువునెత్తి రికార్డులను సాధించింది. క్లీన్ అండ్ జెర్క్‌లో దక్షిణ కొరియా లిఫ్టర్ ఉన్ జూ కిమ్ 164 కిలోలతో బరువుతో రికార్డును నెలకొల్పింది.
ప్లస్ 75 కిలోల విభాగం: రష్యాకు చెందిన తతియానా కషిరినా స్నాచ్‌లో 155, క్లీన్ అండ్ జెర్క్‌లో 193, మొత్తం 348 కిలోల బరువులను ఎత్తి రికార్డులను స్వీప్ చేసింది.
===========
అడ్డదారులు!
ఎంత శ్రమించినా చివరి క్షణాల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా మొత్తం కృషి వృథా అవుతుందన్న భయం లిఫ్టర్లను వేధిస్తుంది. అందుకే ఇటీవల కాలంలో డోపింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. తాత్కాలికంగా శక్తిసామర్థ్యాలను పెంచే మాదక ద్రవ్యాలను వాడడం లిఫ్టర్లకు అలవాటైంది. ఉత్ప్రేరకాలను వాడడం, డోపింగ్ పరీక్షలో పట్టుబడడం ఆనవాయితీగా మారింది. డోపింగ్ దోషుల్లో సగానికిపైగా లిఫ్టర్లే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. డోపింగ్‌కు పాల్పడి పరువు పోగొట్టుకున్న వారిలో మన లిఫ్టర్లు కూడా ఉన్నారు.

- విశ్వ