జాతీయ వార్తలు

ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ బెంగళూరు కేంద్రంగా నిర్వహించే స్వచ్ఛంద సంస్థ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. స్వచ్ఛంద సంస్థలు విరాళాలు పొందాలంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ చట్టం నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ సంస్థ నిబంధనలను అతిక్రమించటంతో గుర్తింపును రద్దుచేశారు. విదేశీ నిధులకు సంబంధించిన ఖర్చులు, ఆదాయ వివరాలను సమర్పించటంతో సంస్థ విఫలమైంది. దీంతో ఎన్నోసార్లు షోకాజ్ నోటీసులు పంపినా ఫలితం లేకపోవటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ సంస్థకు చైర్‌పర్సన్‌గా సుధా నారాయణ మూర్తి వ్యవహరిస్తున్నారు.