రాష్ట్రీయం

పోచారంలో ఇన్ఫోసిస్ విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

25వేల మంది ఐటి ఉద్యోగుల లక్ష్యం
తెలంగాణ మంత్రి కెటిఆర్‌తో ఇన్ఫోసిస్ సిఇఓ విశాల్ సిక్కా భేటీ

హైదరాబాద్, డిసెంబర్ 28: 25వేల మంది ఐటి ఉద్యోగులు పని చేసే విధంగా హైదరాబాద్‌లోని పోచారం క్యాంపస్‌ను పూర్తి స్థాయిలో విస్తరించనున్నట్టు ఇన్ఫోసిస్ సిఇఓ అండ్ ఎండి విశాల్ సిక్కా తెలిపారు. విశాల్ సిక్కా టి-హబ్‌లో ఐటి శాఖ మంత్రి కె తారక రామారావును సోమవారం కలిశారు. వచ్చే ఏడాది నాటికి పోచారం క్యాంపస్‌ను పూర్తి స్థాయిలో విస్తరించనున్నట్టు చెప్పారు. టి -హబ్‌ను సందర్శించిన విశాల్ సిక్కా అక్కడి వౌలిక వసతులను చూసి అభినందించారు. అన్ని సౌకర్యాలతో ఇలాంటి భారీ ఇంక్యుబేటర్‌ను ఇప్పటి వరకు తాను చూడలేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్‌ల కోసం ఆలోచనలను ప్రోత్సహించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇన్ఫోసిస్ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుందని ఐటి మంత్రి కె తారక రామారావు తెలిపారు. ఇన్ఫోసిస్ తమ క్యాంపస్ విస్తరణ ద్వారా ఐటి పరిశ్రమను హైదరాబాద్ నలుమూలలా విస్తరించాలనే తమ ప్రణాళికకు ఊతం ఇచ్చినట్టు అయిందని అన్నారు. టి- హబ్ కార్యక్రమాలకు సంస్థ తరఫున సహకారం అందించాలని కెటిఆర్ కోరారు.
విశాల్ సిక్కా త్వరలోనే టి-హబ్‌లోని స్టార్టప్ కంపెనీలతో మాట్లాడేందుకు మరోసారి హైదరాబాద్ వస్తారని కెటిఆర్ తెలిపారు. టి-హబ్‌లోని ఆవిష్కరణలకు స్టార్టప్ ఫండింగ్ ఇచ్చేందుకు ఇన్ఫోసిస్ ఇన్నోవేషన్ ఫండ్ భాగస్వామ్యం పొందేందుకు ఆసక్తి చూపించినట్టు కెటిఆర్ తెలిపారు. త్వరలోనే ఐటి పాలసీ ప్రకటించనున్నట్టు కెటిఆర్ విశాల్ సిక్కాకు తెలిపారు. సమావేశంలో ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్‌తో పాటు ఇన్ఫోసిస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.