రంగారెడ్డి

ప్రైవేటు పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మర్పల్లి, మార్చి 10: ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు వౌలిక సదుపాయాలు కల్పించాలని రంగారెడ్డి జిల్లా ఉప విద్యాధికారి హరిచందర్ నాయక్ సూచించారు. గురువారంనాడు వార్షిక పరీక్షల నిర్వహణను పరిశీలించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలైన కొంశెట్‌పల్లి, మర్పల్లి, కోట మర్పల్లి, పట్లూర్ తెలుగు మీడియం, పట్లూర్ ఉర్దూ మీడియం పాఠశాలలతోపాటు కెజిబివి పాఠశాల మరియు ప్రైవేటు పాఠశాలలైన ప్రతిభ భారతి పాఠశాలను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ విద్యార్థులకు తాగునీటి సౌకర్యంతోపాటు మూత్రశాలలు, మరుగుదొడ్లు ఏర్పాటుచేయాలని అన్నారు. అన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తమతమ పాఠశాలల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పొందుపరచాలని వాటిని పరిశీలించి ఆయా పాఠశాలలకు గుర్తింపు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మార్చి 22 వరకు విద్యార్థుల ఫలితాలు తెలిపి పై తరగతులకు మార్చి విద్యాబోధన చేయాలని అన్నారు. ఇకపై 1 నుండి 8వ తరగతులను ప్రాథమిక పాఠశాలలుగా, 9 నుండి 12వ తరగతులను మాధ్యమిక పాఠశాలలుగా మార్చే అవకాశాలున్నాయని అన్నారు. ఈయన వెంట మర్పల్లి మండల విద్యాధికారి విద్యాసాగర్ కూడా ఉన్నారు.