అంతర్జాతీయం

పెను భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్విటో, ఏప్రిల్ 17: లాటిన్ అమెరికా దేశమైన ఈక్వెడార్‌ను పెను భూకంపం కుదిపేసింది. దేశ వాయవ్య తీరానికి 27కిలోమీటర్ల దూరంలో భూకంపం మూల కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. రిక్టర్ స్కేలుపై 7.8పాయింట్ల తీవ్రతతో నమోదైన ఈ భూకంప తాకిడికి కనీసం 233మంది దుర్మరణం చెందారు. నాలుగు వందలమందికి పైగా గాయపడ్డారు. అనేక భవనాలు, వంతెనలు నేలపట్టమయ్యాయి. నిముషం పాటు భూమి కంపించడంతో కదిలిపోతున్న తమ ఇళ్లను చూసి బెంబేలెత్తిన ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వీధుల్లోకి పరుగులు పెట్టారు. కూలిన భవనాల శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారని, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ఈక్వెడార్ ఉపాధ్యక్షుడు జోర్జ్ గ్లాస్ తెలిపారు. వీరిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టామన్నారు. ఇంత తీవ్ర స్థాయిలో భూకంపం సంభవించడం గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ జరగలేదని తెలిపారు. పెను భూకంపం తర్వాత 55కు పైగా ప్రకంపనలు సంభవించాయని, మొదట్లో సునామీ హెచ్చరికలూ జారీ అయ్యాయని గ్లాస్ వెల్లడించారు. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత సంభవించిన భూకంపానికి ఈక్వెడార్‌తో పాటు ఉత్తర పెరూ, దక్షిణ కొలంబియాలోని అనేక ప్రాంతాలు ఊగిపోయాయి. భూకంప ప్రభావానికి తీవ్ర స్థాయిలో గురైన ఆరు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని సాధ్యమైనంత మేర ప్రాణాలతో బయటకు తీసుకొచ్చేందుకు సైనికులు, పోలీసులు, ఇతర స్వచ్ఛంద సహాయ బృందాలను పెద్ద ఎత్తున రంగంలోకి దింపారు. వాటికన్ పర్యటనకు వెళ్లిన దేశాధ్యక్షుడు రాఫల్ కొర్రియా అత్యవసరంగా స్వదేశానికి తిరిగి వస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం భూకంపం సంభవించిన ప్రాంతంలోనే 1900 నుంచి ఇప్పటి వరకూ 7 పాయింట్లకు పైగా తీవ్రతతో ఏడు భూకంపాలు నమోదయ్యాయి.